ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారం నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అరెస్టు వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో, అసలెవరీ ధనుంజయ రెడ్డి అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి…జగన్ జిరాక్స్ అని తెలుస్తోంది. రాజకీయ, పాలనాపరమైన వ్యవహారాల్లో ధనుంజయ రెడ్డి, జగన్ లది ఒకే స్టైల్ అని టాక్.
2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఆయనకు అదనపు కార్యదర్శిగా ప్రస్థానం మొదలుబెట్టిన ధనుంజయ రెడ్డి…2024 నాటికి సీఎంవోలో షాడో జగన్ అనే రేంజికి ఎదిగారు. జగన్‌లా ఆలోచించడం…మీటింగులు మొదలు డీలింగుల వరకు అంతా జగన్ మాదిరే పనులు చక్కబెట్టడంలో ధనుంజయ దిట్ట. గ్రూపు, వర్గ రాజకీయాలకు చెక్ పెట్టడం, ట్రబుల్ షూటింగ్ లో ఈయన ఎక్స్ పర్ట్ అట.
2019, 2020లో జగన్ ఆలోచనావిధానాన్ని అవపోసనపట్టిన ధనుంజయ రెడ్డి…ఐఏఎస్ గా పరిపాలనా బాధ్యతల కన్నా జగన్ సొంత వ్యవహారాలను చక్కబెట్టడంపై ఎక్కువ ఫోకస్ చేశారట. ఇసుక, మద్యం, కాంట్రాక్ట్‌లు, ఇతర కీలకమైన విషయాల్లో ధనుంజయ్‌రెడ్డి నిర్ణయాలను జగన్ కూడా బలపరిచేవారట. ఇలా సర్వాంతర్యామిలా ఎదిగిన ఈ అధికారి… ఐదేళ్లూ పాలనపై పెత్తనం చలాయించాట. పోస్టింగులలో సైతం తన అస్మదీయులను అందలం ఎక్కించడం ఈయన స్పెషాలిటీ.
తనను ప్రశ్నించేవారి ప్రమోషన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడం ధనుంజయ రెడ్డి మేనరిజమట. ఐఏఎస్ అధికారిగా ఉంటూ వైసీపీకి రాజకీయ సేవలు చేసే అనధికారిక సలహాదారుగా ధనుంజయ రెడ్డి చలామణీ అయ్యారట. ఇది, ఇతర పార్టీల ఎమ్మెల్యేల ఆరోపణ కాదు…స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణ అని తెలుస్తోంది. ఇక, 3200 కోట్ల రూపాయలని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో ధనుంజయరెడ్డిదే కీలక పాత్ర అని తెలుస్తోంది.