జగన్ గురించి తెలిసిన వారు ఆయన ‘ర్యాపిడ్ యాక్షన్’ గురించి ప్రస్తావిస్తున్నారు. ఏ నిర్ణయమైనా.. జగన్ చాలా వేగంగా తీసుకుంటారని.. దీనిలో ఎవరి సూచనలు.. సలహాలు కూడా ఆయన పాటించరని చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జగన్ దగ్గర పనిచేసిన మాజీ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు. “జగన్ ర్యాపిడ్ యాక్షన్ వల్లే.. ఆయన చాలా నష్టపోయారు” అని వ్యాఖ్యానించారు.
మద్యం నుంచి ఇసుక వరకు వైసీపీ హయాంలో వివాదాలు తలెత్తాయి. వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు ఉచిత ఇసుక విధానం కొనసాగింది. అయితే.. జగన్ అధికారంలోకి వస్తూనే ఉచితాన్నిరద్దు చేశారు. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఫలితంగా చాలా మంది ఆకలి చావులు ఎదుర్కొన్నారు. కుటుంబాలు కూడా నీరుగారిపోయాయి. ఇక, మద్యం విధానంలోనూ సమూల మార్పులు చేశారు. కొత్త డిస్టిలరీల పేరుతో తన వారిని ఎంపిక చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఇది పెను వివాదంగా మారింది. అయినా.. జగన్ వెనక్కి తగ్గలేదు. పైగా ఈ విధానాలు వద్దని చెప్పినా విన ల్లేదని.. ఎల్వీ చెప్పుకొచ్చారు. “అన్నా దానిపై నిర్ణయం అయిపోయింది. ఇంక వేరేదేదైనా చెప్పండి” అనే వారని వెల్లడించేవారని చెప్పుకొచ్చారు. దీంతో అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిపా రు. అంతేకాదు.. సీఎం పోస్టును కేవలం ప్రభుత్వ ఉద్యోగంగా ఆయన చూసినట్టు తెలిపారు. ఉదయం 11 గంటలకు వచ్చి.. సాయంత్రం 6 అయ్యే సరికి పైకి వెళ్లిపోయేవారని ఎల్వీ చెప్పుకొచ్చారు.
ఒక్క అధికారులతోనే కాదు.. నాయకులతోనూ జగన్ ఇదే విధంగా వ్యవహరించారని ఎల్వీ చెప్పుకొచ్చారు. రాజకీయంగా తన ముందుకు ఒక సమస్య వచ్చిందని తెలిపారు. అప్పట్లో ఓ నియోజకవర్గంలో(పేరు చెప్పలేదు) సమస్య వచ్చినప్పుడు.. జగన్ పరిష్కరించాలని అక్కడి నాయకులు తన వద్దకు వచ్చారని తెలిపారు. తను ఆశ్చర్యపోయానని.. రాజకీయంగా తను ఆ సమస్య ఎలా పరిష్కరించాలని ప్రశ్నిస్తే.. జగన్ తమను పట్టించుకోవడం లేదన్నారన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మీరే పరిష్కరించాలని సూచించారని వారు కోరడం తనను ఆశ్చర్య పోయేలా చేసిందన్నారు. అయితే.. జగన్ వ్యవహార శైలిని తాను అర్ధం చేసుకుని అక్కడి సమస్యను పరిష్కరించినట్టు తెలిపారు. ఇవన్నీ.. జగన్‌కు మంచి అనిపించినా.. జనాల్లో నెగిటివిటీని బాగా పెంచాయ న్నారు. డబ్బులు ఇస్తే.. ఏదో తనకు మేలు జరుగుతుందని జగన్ అనుకున్నారని.. కానీ, దూరదృష్టి లేని రాజకీయం, స్థితిమతం లేదని పాలన కారణంగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు.