టీడీపీ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ పాలిటిక్స్‌తో అదరగొట్టారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన వరుసగా రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. సతీమణి వసుంధరతో కలిసి వచ్చి నియోజకవర్గంలో నిర్వహించిన పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల పద్మభూషణ్ సత్కారం కూడా పొందడంతో బాలయ్య అభిమానులు.. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన సత్కారం చేశారు. సోమవారంఉదయం నియోజకవర్గంలో పర్యటించిన బాలయ్య కొన్ని చోట్ల సభల్లోనూ ప్రసంగించారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాయల సీమ ను తన అడ్డాగా ప్రకటించిన ఆయన.. ఇక్కడ వైసీపీ ఆగడాలు సాగబోవని వెల్లడించారు. దోచుకుని.. దాచుకునేందుకు ప్రయత్నిస్తే.. తాటతీస్తా అంటూ వైసీపీ నాయకులకు మాస్ హెచ్చరిక చేశారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని వైసీపీ నాయకులపై వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ.. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే.. ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
అనంతరం.. నియోజకవర్గంలో హిందూపురం మండలంలో లబ్ధిదారులైన ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. టీడీపీ అంటే.. పారదర్శకతకు పెద్దపీట వేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు విజనరీ ఉన్న లీడర్ అని, ఆయన ఆధ్వర్యంలోనే రాజధాని అమరావతి పూర్తవుతుందని చెప్పారు. తాను నియోజకవర్గం లో ఉండడం లేదని అంటున్నవారికి మైండ్ పనిచేయడం లేదని విమర్శించారు. తాను ఈ 10 మాసాల కాలంలో 50 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
టీడీపీ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ పాలిటిక్స్‌తో అదరగొట్టారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన వరుసగా రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. సతీమణి వసుంధరతో కలిసి వచ్చి నియోజకవర్గంలో నిర్వహించిన పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల పద్మభూషణ్ సత్కారం కూడా పొందడంతో బాలయ్య అభిమానులు.. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన సత్కారం చేశారు. సోమవారం ఉదయం నియోజకవర్గంలో పర్యటించిన బాలయ్య కొన్ని చోట్ల సభల్లోనూ ప్రసంగించారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాయలసీమను తన అడ్డాగా ప్రకటించిన ఆయన.. ఇక్కడ వైసీపీ ఆగడాలు సాగబోవని వెల్లడించారు. ‘దోచుకుని.. దాచుకునేందుకు ప్రయత్నిస్తే.. తాటతీస్తా’ అంటూ వైసీపీ నాయకులకు మాస్ హెచ్చరిక చేశారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని వైసీపీ నాయకులపై వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ.. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే.. ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
అనంతరం.. నియోజకవర్గంలో హిందూపురం మండలంలో లబ్ధిదారులైన ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. టీడీపీ అంటే.. పారదర్శకతకు పెద్దపీట వేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు విజనరీ ఉన్న లీడర్ అని, ఆయన ఆధ్వర్యంలోనే రాజధాని అమరావతి పూర్తవుతుందని చెప్పారు. తాను నియోజకవర్గం లో ఉండడం లేదని అంటున్నవారికి మైండ్ పనిచేయడం లేదని విమర్శించారు. తాను ఈ 10 మాసాల కాలంలో 50 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates