Political News

జ‌గ‌న్ కు.. ‘వ‌ర్క్ ఫ్రమ్ బెంగ‌ళూరు’ టైటిల్!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రింత బ‌ద్నాం అవుతున్నారా? ఆయ‌న చేస్తున్న ప‌నుల‌పై కూట‌మి స‌ర్కారు ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం చేస్తోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ నాయ‌కులు. “ఒక త‌ప్పు కాయొచ్చు..రెండు వ‌ర‌కు స‌రిపెట్టుకోవ‌చ్చు. కానీ, ప‌దే ప‌దే త‌ప్పులు చేసుకుంటూ పోతే.. జ‌గ‌న్ బ‌ద్నాం కాక ఏమ‌వుతారు. ఇంత‌క‌న్నా ఏం చెప్ప‌లేం” అని వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌జ‌ల్లో ఉండ‌డం అనేది రాజ‌కీయ నాయ‌కుల ల‌క్ష‌ణం. పైగా త‌న‌పాల‌న‌పై మ‌ర‌క‌లు, మ‌చ్చ‌లు ప‌డ్డాక వాటిని తుడుపుకొనేందుకైనా జ‌గ‌న్ ప్ర‌య‌త్నించి ఉండాలి. ప్ర‌యత్నించాలి కూడా!

కానీ, ఆ దిశ‌గా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. పైగా.. ఉంటే తాడేప‌ల్లి, లేక‌పోతే బెంగ‌ళూరు అన్నట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో కూట‌మి నాయ‌కులు ఆడేసుకుంటున్నారు. వ‌ర్క్ ఫ్ర‌మ్ బెంగ‌ళూరు’ టైటిల్ ఇచ్చేశారు. రాష్ట్రంలోని రైతుల దుస్థితి, సీఎం చంద్ర‌బాబు ప‌నితీరుపై జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌కు స్పందించిన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. ఇలానే వ్యాఖ్యానించారు. మంత్రి అనిత‌ కూడా.. ఇదే కామెంట్లు చేశారు. ‘వ‌ర్క్ ఫ్ర‌మ్ బెంగ‌ళూరు’ చేసే జ‌గ‌న్‌కు రాష్ట్రంలో ప‌రిస్థితులు ఏమ‌ర్థ‌మవుతాయ‌ని వ్యాఖ్యానించారు. ‘ఉంటే తాడేప‌ల్లి.. లేక‌పోతే బెంగ‌ళూరు. ఇంతేగా.. జ‌గ‌న్ తీరు’ అని ఎద్దేవా చేస్తున్నారు.

ఇక‌, జ‌గ‌న్ ప‌నితీరు కూడా అలానే ఉంది. అధికారంలో ఉన్న‌ప్పుడు తాడేప‌ల్లికి ప‌రిమిత‌మైన ఆయ‌న .. ప్ర‌స్తుతం బెంగ‌ళూరు లోనే ఎక్కువ‌గా ఉంటున్నారు. కార‌ణాలు ఏవైనా నెల‌లో 15-20 రోజులు బెంగ‌ళూరులోని ప్యాల‌స్‌లోనే ఉంటున్నార‌న్న‌ది వైసీపీ నాయ‌కులు సైతం చెబుతున్న మాట‌. ఇది.. కూట‌మి స‌ర్కారు నాయ‌కుల‌కు క‌లిసి వ‌చ్చింది. జ‌గ‌న్ చేసే విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌డంతోపాటు.. వ‌ర్క్ ఫ్రమ్ బెంగ‌ళూరు టైటిల్‌తో ఇర‌గ‌దీస్తున్నారు. రాబోయే రోజుల్లే ఇదే స్థిర‌ప‌డితే.. జ‌గ‌న్‌ను నాన్‌లోక‌ల్ గా చూసే ప్ర‌మాదం ఉంటుంది. అప్పుడు ఆ ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

ఒక‌ప్పుడు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబును ఇలానే వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానించారు. దీంతో ఆయ‌న త‌న మ‌కాంను ఉండ‌వ‌ల్లికి మార్చుకుని.. రాజ‌ధాని ప‌రిధిలోనే సొంత‌గా ఇల్లు నిర్మించుకుంటున్న విష‌యం తెలిసిందే. మ‌రి జ‌గ‌న్‌కు ఇక్క‌డ సొంత ఇల్లు ఉన్నా.. బెంగ‌ళూరులోనే ఎక్కువ‌గా ఉండ‌డం, అక్క‌డ నుంచే సోష‌ల్ మీడియాలోనూ స్పందించ‌డం వంటివి రాజ‌కీయంగా ఆయనకు మైన‌స్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on May 4, 2025 8:09 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago