Political News

అంబ‌టి గారూ.. మూడు ముక్క‌లాట మ‌రిచారా?!

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు .. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిపై మ‌రోసారి అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. అదేస‌మ‌యంలో రాజ‌ధాని విష‌యంలో మూడు ముక్క‌లాట మ‌రిచి పోయిన‌ట్టు ఆయ‌న కామెంట్లు చేశారు. “జ‌గ‌నే అమ‌రావ‌తిని అభివృద్ధి చేయాల‌ని అనుకున్నాడు. కానీ, చంద్ర‌బాబు కోర్టుల‌కు వెళ్లి అడ్డుకున్నారు” అని తాజాగా అంబ‌టి మీడియా ముందు కామెంట్లు చేశారు.

దీనిపై నెటిజ‌న్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఎక్క‌డైనా.. ఎవ‌రైనా.. రాజ‌ధానిని బాగు చేస్తాన‌ని అంటే.. అడ్డుకుంటారా? అస‌లు రాజ‌ధానిని బాగు చేయ‌మ‌నే క‌దా.. నాడు అసెంబ్లీలో చేతులు జోడించి చంద్రబాబు వేడుకుంది! కానీ, మీరు చేసిందేంటి? అని ప్ర‌శ్నిస్తున్నారు. మూడు రాజ‌ధానుల పేరుతో అమ‌రావ‌తి రైతుల‌ను అస‌హ్యించుకున్నారు. వారి త్యాగాల‌ను.. నాట‌కాలుగా.. కులం పేరు అంట‌గ‌ట్టి చీద‌రించుకుని లాఠీల‌తో కుమ్మించారు.. అని గ‌తాన్ని గుర్తు చేస్తున్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన అంబ‌టి.. శుక్ర‌వారం జ‌రిగిన రాజ‌ధాని పనుల పునః ప్రారంభంపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. ఈ స‌భా వేదిక‌గా.. సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ అబ‌ద్ధాలు చెప్పార‌ని అన్నారు. అమ‌రావ‌తి నిర్మాణంలో చంద్ర‌బాబు అట్ట‌ర్ ప్లాప్ అయ్యార‌ని విమ‌ర్శించారు. కానీ.. వాస్త‌వానికి అమ‌రావ‌తి నిర్మాణం చేప‌ట్టి.. ప్రారంభించి.. ప‌నులు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే క‌దా.. ఎన్నిక‌లు వ‌చ్చి 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని.. మ‌రి ఆ ప‌నుల‌ను మీరెందుకు కొన‌సాగించ‌లేదు? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

“అమరావతి కోసం గత చంద్రబాబు ప్రభుత్వంలో 41 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా టెండర్లు పిలిచారు. 5500 కోట్లు ఖర్చు చేశారు. గత ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో అమరావతి భ్రమరావతి అయింది.” అని అంబ‌టి నోరుపారేసుకున్నారు. ఆ నిర్మాణాలే క‌దా.. ఇప్పుడున్న స‌చివాల‌యం, అసెంబ్లీ, హైకోర్టు.. వంటివి. మీరు పాలించిన ఐదేళ్లు కూడా అక్క‌డ నుంచే పాల‌న సాగించారు క‌దా? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌.

రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జ‌లు అమ‌రావ‌తిని అంగీక‌రించి.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాకే.. 2024లో మార్పు వ‌చ్చింద‌ని.. 11 స్థానాల‌కేమిమ్మ‌ల్ని ప‌రిమితం చేశార‌ని అంటున్నారు. ఈ నిజాన్ని వైసీపీ నాయ‌కులు గుర్తించ‌లేక‌పోతే.. ఇంకా ఇలానే వ్య‌వ‌హ‌రిస్తే.. వైసీపీ పేరు కూడా క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశం కొద్ది దూరంలోనే ఉంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

This post was last modified on May 3, 2025 3:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago