దాసరి సుధ. ఉమ్మడి కడప జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం బద్వేల్ నుంచి రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. 2022-23 మధ్య వచ్చిన ఉప ఎన్నికలో(ఆమె భర్త మరణంతో) ఒకసారి, 2024లో వచ్చిన ఎన్ని కలో రెండోసారి విజయం దక్కించుకున్నారు. ఈమె.. సౌమ్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి కూటమిలో ఉన్నారన్న పేరు కూడా ఉంది. అవినాష్‌రెడ్డి ఎంత చెబితే అంత అన్నట్టుగా ఆమె రాజకీయాలు చేశారు.
కానీ, ఇది ఎన్నికల వరకు విజయం దక్కించి పెట్టినా.. మారిన పరిస్థితులు.. వైసీపీలోని బద్వేల్ నేతల వర్గ రాజకీయాల్లో ఎమ్మెల్యే ఒంటరి అయ్యారు. బద్వేల్ నియోజకవర్గంలో అవినాష్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న వర్గం దూకుడు పెంచింది. దీనికి తోడు.. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన మరో వర్గం నాయకుడు కూడా.. దాసరి సుధపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఆమె వల్ల నియోజకవర్గంలో ఏమీ జరగడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఇక, వ్యక్తిగతంగా చూసుకున్నా.. సుధ పనితీరు ఏమాత్రం బాగోలేదన్న చర్చ ఉండనే ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. కూడా ఆమె నియోజకవర్గంలో ఏ పనులు చేయలేదని అంటారు. ఇప్పుడు ప్రభుత్వ పక్షంలో లేకపోవడం.. వ్యతిరేక వర్గాలు రెండూ కూడా.. ఆమెను దూరం పెట్టడంతో ఎటూ పాలు పోని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల కిందట తన గోడు చెప్పుకొనేందుకు తాడేపల్లికి రాగా.. రెండు రోజులు వెయిట్ చేయించారు.
దీంతో మనస్థాపానికి గురైన సుధ.. జగన్‌ను కానీ.. తాడేపల్లి పెద్దలను కానీ.. కలవకుండానే ఇంటికి వెళ్లిపో యారు. ఈ పరిణామాలతో ఆమె చూపు మారుతోందని కొన్ని రోజులుగా చెబుతున్నారు. జనసేన నుంచి ఆమెకు ఆహ్వానాలు అందడం.. కుటుంబ పరంగా పవన్ కల్యాణ్ అభిమానులు ఉండడం వంటివి ఆమెను మార్పు దిశగా అడుగులు వేయిస్తున్నాయని తెలుస్తోంది. సో.. ఆమె వైసీపీకి దూరం కావడం ఖాయమని అంటున్నారు. మరి రాజకీయాలన్నాక ఏమైనా జరగొచ్చుకదా! సుధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోచూడాలి.
This post was last modified on April 28, 2025 11:35 am
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…