ఏడాదిలో మ‌కాం మార్పు.. చంద్ర‌బాబు ప‌క్కాలెక్క‌..!

ఏడాది తర్వాత‌.. సీఎం చంద్ర‌బాబు స‌హా.. అధికారులంతా ఎక్క‌డ నుంచి ప‌నిచేస్తారు? ఎక్క‌డ ఉంటారు? అంటే.. తాజాగా ప్ర‌భుత్వం చెబుతున్న స‌మాచారం ప్ర‌కారం.. అమ‌రావ‌తిలోని ఐకానిక్ ట‌వ‌ర్ల నుంచే అని! ప్ర‌స్తుతం కాంట్రాక్టులు.. బిడ్డింగుల ప‌నుల్లో ఉన్న ఈ వ్య‌వ‌హారంపై తాజాగా బ్లూప్రింట్ విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం.. ఏడాదిలో ఉన్న‌తాధికారుల భ‌వ‌నాలు పూర్తికానున్నాయి. దీనికి సంబంధించి.. ప‌క్కా లెక్క‌లు వేసుకున్నారు.

ప్ర‌స్తుతం మూడు ఐకానిక్ ట‌వ‌ర్ల నిర్మాణానికి.. షెడ్యూల్ ఖ‌రారు చేశారు. దీని ప్ర‌కారం.. ఉన్న‌తాధికారులై న ఐఏఎస్‌, ఐపీఎస్‌ల నివాస స‌ముదాయాలు.. కార్యాల‌యాల‌ను కూడా.. రెడీ చేస్తున్నారు. అలానే.. సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌త్యేకంగా కార్యాల‌యం.. ఉప ముఖ్య‌మంత్రి భ‌వ‌నాలు.. వంటివి కూడా.. దీనిలో చేర్చారు . వీటిని బ‌హుళ అంత‌స్థుల‌లో నిర్మిస్తున్నారు. ఒక్కొక్క భ‌వ‌నం 40 అంత‌స్థుల‌కు త‌క్కువ కాకుండా ఉంటుంది. అంతేకాదు.. ప్ర‌త్యేక స‌దుపాయాలు కూడా ఉంటాయి.

వీటికి సంబంధించిన‌.. అన్ని అనుమ‌తులు తెచ్చుకున్నారు. అంతేకాదు.. నిధులు కూడా రెడీ చేసుకు న్నారు. ఫ‌లితంగా ప‌నుల వేగం పుంజుకోనుంది. గ‌తంలో మాదిరిగా కాకుండా.. అవ‌స‌ర‌మైతే.. ప్ర‌త్యేక సాయం చేసేలా దేశీయ బ్యాంకుల‌తోనూ.. ఒప్పందాలు చేసుకున్నారు. గ‌తంలో కొన్ని నిధులు ఆగిపోయిన ద‌రిమిలా.. మ‌ధ్య‌లో ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. పైగా.. క్లారిటీ కూడా మిస్ అయింది. ఇప్పుడు ఆ ప‌రిస్థితి త‌లెత్త‌కుండా.. చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

మంత్రి నారాయ‌ణ చెప్పిన‌ట్టుగా ఒక టైమ్ బౌండ్ ప్ర‌కారం ప‌నులు చేయ‌నున్నారు. ఇదే జ‌రిగితే.. ఏడాది లోగా ఐకానిక్ ట‌వ‌ర్ల నిర్మాణం పూర్తి అవుతుంది. త‌ద్వారా.. అమ‌రావ‌తికి స్ప‌ష్ట‌మైన రూపు రేఖ‌లు రానున్నా యి. ఫ‌లితంగా.. సీఎం కార్యాల‌యం నుంచి ఇత‌ర మంత్రులు, అధికారుల కార్యాల‌యాల వ‌ర‌కు కూడా.. అన్నీ.. అమ‌రావ‌తిలోని ఐకానిక్ ట‌వ‌ర్ల నుంచే జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం కూడా.. స్ప‌ష్ట‌త‌తో ఉండ‌డం గ‌మ‌నార్హం.