కన్నీళ్లు కష్టాల్లోనే కాదు.. ఇష్టాల్లోనూ వస్తాయి. ఏకన్నీరెనకాల ఏముందో తెలుసుకోవడం.. ఈజీనే! ఇప్పుడు ఇలాంటి కన్నీళ్లే.. మంత్రి నారా లోకేష్‌ను చుట్టుముట్టాయి. “తాత వెలుగులు నింపితే…మనవడు గూడు
ఇచ్చాడయ్యా“ అంటూ మంగళగిరి ప్రజలు మంత్రి లోకేష్ ను చుట్టుముట్టి.. తమ పట్టలేని ఆనందాన్ని కన్నీటి రూపంలో ఆయన ముందు కార్చేసి.. సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు.. కొందరైతే.. ఆయనను కావలించుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
విషయం ఏంటి?
ప్రస్తుత తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో నారా లోకేష్.. `మన ఇల్లు-మన లోకేష్` కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తన నియోజకవర్గం పరధిలో.. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు అక్కడే వారి ఇళ్లనే క్రమబద్ధీకరణ చేస్తూ. వారికి పట్టాలు ఇస్తున్నారు. దీంతో ఇక్కడి పలు గ్రామాలు.. నదితీర ప్రాంతంలో ఉన్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా గుడెసలు వేసుకుని నివసిస్తున్న తమకు .. ఇన్నాళ్లకు ఇప్పుడు హక్కులు కల్పించారంటూ… వారు ఆనందంతో ఉబ్బితబ్బి బ్బవుతూ.. తమ ఆనందాన్ని మాటల్లో వ్యక్తీకరించలేక.. కన్నీటి రూపంలో ప్రకటిస్తూ.. నారా లోకేష్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
ముఖ్యంగా కృష్ణానది తీరానికి కుడివైపు తాడేపల్లిలో ఉన్న ప్రాంతాన్ని `మహానాడు`గా పేర్కొంటారు. టీడీపీ వ్యవస్థాపకుడు.. ఎన్టీఆర్.. సుమారు 40 ఏళ్ల కిందట ఇక్కడే పార్టీ కీలక కార్యక్రమం మహానాడును నిర్వహిం చారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి మహానాడు అనే పేరు స్థిరపడింది. ఇక్కడ వేలాది మంది ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. అయితే.. వారికి ఎలాంటి హక్కులు లేవు.అనేక సార్లు ప్రభుత్వాలకు తమ బాధను విన్నవించినా.. వారు ఎవరూ పట్టించుకోలేదు.
మహానాడు ప్రాంతంలో లోకేష్ తన పాదయాత్ర సమయంలో స్థానికులతో మమేకమై రోడ్డు ప్రక్కన బజ్జీలు తింటూ తాము అధికారంలోకి వచ్చాక ఇళ్ళపట్టాలు ఇస్తామని హామీఇచ్చారు. ఈ క్రమంలోనే నాలుగు దశాబ్దాలకు పైగా ముడిపడకుండా ఉన్న తమ సమస్యను ఇప్పుడు పరిష్కరించడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ కు ఆజన్మాంతం ఋణపడి ఉంటామంటూ లబ్ధిదారులు ఆనంద భాష్పాలతో ఆయనను చుట్టుముట్టి.. సంతోషం వ్యక్తీకరిస్తున్నారు.