కూట‌మికి నేటితో ప‌ది నెల‌లు.. ఏం సాధించారంటే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి శుక్ర‌వారంతో 10 మాసాలు గ‌డిచాయి. గ‌త ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి స‌ర్కారుకొలువు దీరింది. అప్ప‌ట్లో విజ‌య‌వాడ శివారులో నిర్వ‌హించిన ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర మానికి ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ సైతం హాజ‌ర‌య్యారు. అంగ‌రంగ వైభ‌వంగా ప్ర‌మాణ స్వీకార ఘ‌ట్టం జ‌రిగింది. ఇక‌. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కారు చేసిన ప‌నులు.. దేశ‌వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నా యి. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌తోపాటు.. రాష్ట్రంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు కూడా.. ప్రాధాన్యం పెరిగింది.

ముఖ్యంగా ఈ ప‌ది మాసాల కాలంలో వృద్ధి మ‌రింత పెరిగి.. రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన విధానం ప్ర‌దానంగా కూట‌మి స‌ర్కారుకు మంచి మార్కులు ప‌డేలా చేసింది. ప్ర‌స్తుతం 2.2 శాతం మేర‌కు వృద్ధి పెరిగిన‌ట్టు కేంద్ర‌మే పేర్కొంది. ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నుల‌ను వ‌డివ‌డిగా చేప‌డ‌తామ‌ని చెప్పిన‌ట్టుగానే.. కేంద్రం నుంచి సాయంతోపాటు.. ప్ర‌పంచ‌బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి కూడా నిధులు సేక‌రించి.. ముందుకు సాగుతున్నారు.

ఈ నెల 13న అమ‌రావతి ప‌నులకు శ్రీకారం చుడుతున్నారు. ఇదేస‌య‌మంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌పైనా ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. దీంతో వెనుక బ‌డిన జిల్లాల్లో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టేందుకు రూ.350 కోట్లు రేపో మాపో రాష్ట్ర ఖ‌జానాకు అంద‌నున్నాయి. పెట్టుబ‌డుల విష‌యానికి వ‌స్తే… ప‌లు సంస్థ‌లు ఇప్ప‌టికే రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నాయి. ఏర్పాటుకు సిద్ధ‌మ‌య్యాయి. వీటి ద్వారా దాదాపు 2 ల‌క్ష‌ల లోపు ఉద్యోగాలు, 3 ల‌క్ష‌ల‌కు పైగా ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి.

ఇక‌, స‌మ‌స్యల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌తిప‌క్షం నుంచి పెద్ద‌గా పోరు లేక‌పోవ‌డం.. ప్ర‌జ‌ల్లోనూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఇమేజ్‌లు ఏమాత్రం బెస‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో కూడా మార్కులు పెద్ద‌గా త‌గ్గిపోయిన‌ట్టు ఎక్క‌డా లేదు. అయితే.. సూప‌ర్ సిక్స్ విష‌యంలో మాత్రం.. కొంత చ‌ర్చ సాగుతోంది. అయిన‌ప్ప‌టికీ.. ఉచిత సిలిండెర్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ప‌దిమాసాల్లో మంత్రుల ప‌నితీరుపై చంద్ర‌బాబు మార్కులు వేయ‌డం.. వారిని ఎప్ప‌టిక‌ప్పుడు గ్రాఫ్ పెంచుకునేలా చేయ‌డం వంటివి కూట‌మి స‌ర్కారుకు క‌లిసివ‌స్తున్న ప‌రిణామాలు.