Political News

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రహస్యాలు, చీకటి కోణాలు, బయటకు రాని మర్మాలు అంటూ ఏవీ ఇక ఉండబోవని చెప్పాలి. ఏం చేసినా ఎదుటి వారికి కించిత్ కూడా అనుమానం రాకుండా…అసలు జరిగిన కార్యం ఎలా జరిగిందో కూడా అవతలి వారికి తెలియకుండా పనులు చక్కబెట్టడంలో వంశీది అందె వేసిన చేయ్యేనన్న ప్రచారం ఉంది కదా. ఆ తరహా ప్రచారం ఇకపై ఉండబోదు. ఎందుకంటే…తెర ముందు వంశీ ఉంటే…తెర వెనుక ఉండి వంశీ చెప్పిన పనులన్నీ ఎంచక్కా చక్కబెట్టే ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగారావు అలియాస్ రంగాను పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు కదా. తాజాగా రంగాను మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023లో వైసీీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి కర్త, కర్మ, క్రియ అన్నీ వంశీనేని నాడు విపక్షంలో ఉన్న టీడీపీ ఆరోపించింది. అంతేకాకుండా తన టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత అధికార పక్షం వైపు వెళ్లి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యాలయంపైనే దాడి చేయిచారని వంశీపై భగ్గుమంది. ఈ దాడిపై నాడే కేసు నమోదు కాగా.. అందులో వంశీ పేరే లేదు. అయితే వంశీకి రైట్ హ్యాండ్ గా పరిగణిస్తున్న రంగా పేరును ప్రధాన ముద్దాయిగా చేరుస్తూ నాడు కేసు నమోదు అయ్యింది. విచారణ అటకెక్కింది. అయితే టీడీపీ నేతృత్వం లోని కూటమి అదికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు బూజు దులిపిన పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేయడంతో పాటుగా వంశీని 71వ నిందితుడిగా చేర్చింది.

ఇక ఈ కేసును కొట్టేయిద్దామని ప్లాన్ వేసిన వంశీ… దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టై, జైలుకు చేరిన తర్వాత రంగా కూడా ఇటీవలే పోలీసులకు చిక్కిపోయారు. ఇటీవలే రంగాను అరెస్టు చేసిన పోలీసులు… అతడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు… మూడు రోజుల పాటు రంగాను విచారించేందుకు సీఐడీ అదికారులకు అనుమతి మంజూరు చేసింది. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రంగాను సీఐడీ అధికారులు విచారించనున్నారు.

రంగాను విచారించే కేసు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయినా… ఈ దాడికి వంశీ తన అనుచరులను ఎలా ఉసిగొల్పారు? అసలు దాడుల విషయంలో వంశీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు? ఏదైనా వ్యవహారాన్ని ఆయన ఇతరులకు అనుమానం రాకుండా ఎలా చక్కబెడతారు? వంశీ చేసిన నేరాలు ఏ కారణం చేత బయటకు రావు? వంశీ ఆర్జించిన సంపాదనను ఆయన ఎక్కడ దాస్తారు? ఇంత పెద్ద ఎత్తున అనుచరులను వంశీ ఎలా మేనేజ్ చేస్తారు? అసలు గన్నవరంలో ఆయన ప్రైవేట్ సైన్యంలో ఎంత మంది ఉన్నారు?..తదితర వివరాలను రాబట్టేందుకు సీఐడీ అదికారులు పక్కా ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ విచారణ ముగిసిన తర్వాత వంశీకి సంబంధించిన అన్ని వివరాలు ఇట్టే బయటకు వస్తాయన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.

This post was last modified on April 1, 2025 5:30 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

2 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

3 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

3 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

3 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

6 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

6 hours ago