మహిళల్లో పెరుగుతున్న అశ్లీలత, వస్త్రధారణ వల్లే కరోనా వంటి విపత్తులు వస్తున్నాయని పాకిస్థాన్ లోని ప్రముఖ మత పెద్ద, మౌలానా తారిఖ్ జమీల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. దాంతోపాటు, మీడియా అబద్దాలు చెబుతోందని, నిజాన్ని నిర్భయంగా చెప్పే మీడియా సంస్థలు లేవని, అక్కడి న్యాయస్థానాలు దుర్మార్గమై పోయాయని తారిఖ్ జమీల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
‘ఎహ్సాస్ టెలిథాన్’ అనే నిధుల సేకరణకు సంబంధించిన టెలివిజన్ లైవ్ షోలో పాల్గొన్న తారిఖ్ జమీల్.. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై తారిఖ్ జమీల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పాకిస్థాన్ తోపాటు ప్రపంచంలోని మహిళా సంఘాలు, మీడియా సంస్థలు మండిపడ్డాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి మహిళలు పొట్టి పొట్టి దుస్తులు ధరించడమే కారణమన్న అర్ధం వచ్చేలా తారిఖ్ జమీల్ చేసిన వ్యాఖ్యలను అక్కడి స్త్రీలు ఖండించారు.
ఆడవాళ్ళ డ్రస్ వల్లనే కరోనా వచ్చేదయితే మగాళ్ళకు కరోనా ఎందుకు ఎక్కువగా సోకుతోందని పాక్ మహిళలు ప్రశ్నిస్తున్నారు. మీడియా అబద్దాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటోందని తారిఖ్ జమీల్ వ్యాఖ్యానించడంపై అక్కడి మీడియా సంస్థలు మండిపడుతున్నాయి. దీంతో, చివరకు ఆయన క్షమాపణలు చెప్పారు. నోరు అదుపుతప్పి మీడియాపై నోరుపారేసుకున్నట్టు ఒప్పుకున్నారు.
కానీ, మహిళలపై చేసిన వ్యాఖ్యలకు మాత్రం తారిక్ క్షమాపణ కోరలేదు. తారిక్ వ్యాఖ్యలను మానవ హక్కుల కమిషన్ తప్పుబట్టింది. ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని హితవు పలికింది. వివక్షాపూరిత కామెంట్లు మీడియాలో ప్రసారమైతే సమాజంలో మహిళలపై చెడు అభిప్రాయం ఏర్పడుతుందని కమిషన్ ట్వీట్ చేసింది.
అయితే, తారిఖ్ జమీల్ చేసిన వ్యాఖ్యలను ఆయన మద్దతుదారులు సమర్థించుకుంటున్నారు. సమాజంలో అమ్మాయిలు సిగ్గు లజ్జ వదిలేస్తే… యువకులు సిగ్గు లజ్జా వదిలేస్తే … ఆ సమాజం బాగుపడదని, చరిత్రలో అతి దారుణమైన విపత్తు లూత్ జాతిపై వచ్చిందని తారీఖ్ జమీల్ తన ప్రసంగంలో ఉదహరించారని వారు చెబుతున్నారు. సిగ్గులజ్జల విషయంలో లూత్ జాతి అన్నిహద్దులను అతిక్రమించిందని, అందుకే ఆ జాతిపై ఐదు విపత్తులు వచ్చాయని తారిఖ్ జమీల్ చెప్పినట్లు ఉటంకిస్తున్నారు.
అదే మాదిరిగా నేడు పాకిస్థాన్ లో సిగ్గులజ్జలను నాశనం చేసిన వారెవరో తాను చెప్పలేనని…తన దేశ తనయలతో నాట్యం చేయిస్తున్నది ఎవరో తనకు తెలీదని….వారిని అర్థనగ్నంగా నిలబెడుతున్నది ఎవరని తారిఖ్ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అందుకే ఆనాడు అశ్లీలత పెరిగి లూత్ జాతిపై వచ్చిన విపత్తు మాదిరిగానే నేడు కరోనా విపత్తుకూడా వచ్చిందని తారీఖ్ జమీల్ చెప్పినట్లు ఆయన అనుచరులు వాదిస్తున్నారు.
మహిళల వస్త్రధారణపై ఆయన ప్రత్యక్షంగా విమర్శలు చేయలేదని…కేవలం అశ్లీలత పెరిగిపోయిందని మాత్రమే చెప్పినట్లు సమర్థించుకుంటున్నారు. తారిఖ్ జమీల్ అనుచరులు ఎంత సమర్థించుకున్నప్పటికీ…మహిళల వస్త్రధారణపై తారిఖ్ జమీల్ చేసిన వ్యాఖ్యలను మాత్రం స్త్రీ సంఘాలు, అభ్యుదయవాదులు తప్పుబడుతున్నారు. ఆధునిక ప్రపంచంలో కరోనాకు…వస్త్రధారణకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ మీడియాకు క్షమాపణలు చెప్పిన తారిఖ్ జమీల్..మహిళలకు క్షమాపణలు చెప్పకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on April 30, 2020 12:13 pm
నిన్న విడుదలైన అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ కోసం రామ్…
వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి గురువారం సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఓ లేఖ రాశారు. ఈ…
‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్…
తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…