అసెంబ్లీలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్పీకర్ ను ఏమీ అనలేదని, ఎందుకు సస్పెండ్ చేయాలో చెప్పాలని జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు అసెంబ్లీకి వచ్చిన జగదీష్ రెడ్డిని చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. అసెంబ్లీకి రావద్దని, అనుమతి లేదని జగదీష్ రెడ్డికి సూచించారు.
అయితే, తనను అసెంబ్లీకి రావొద్దంటూ స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ, ఆ బులిటెన్ ను చీఫ్ మార్షల్ చూపించలేదు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బులిటెన్ ఇస్తే కోర్టుకు వెళ్తామన్న భయంతోనే బులిటెన్ ఇవ్వడం లేదని స్పీకర్ పై షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇప్పటికే 2 సార్లు స్పీకర్ గారిని కలిసి ఎందుకు సస్పెండ్ చేశారో బులిటెన్ ఇవ్వాలని కోరానని, అయినా ఇవ్వలేదని చెప్పారు. అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోందని, రాజ్యాంగ విలువలు లేకుండా రాజుల కాలంలో ఉన్నట్టు ఉందని ఆరోపించారు.
మరోవైపు, అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వడగండ్ల వానతో పంట నష్టం జరిగిందని విరిగిన మొక్కజొన్న కంకులు, రాలిపడిన మామిడికాయలు తెచ్చి బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోపలకు, మీడియా పాయింట్ దగ్గరకు ఎలాంటి వస్తువులు తేవొద్దంటూ వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. మీడియా పాయింట్ వద్ద రైతులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.
This post was last modified on March 24, 2025 12:34 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
వైసీపీ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంతు వచ్చింది. ఆయన గతంలో ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన డిగ్రీ…
తమీమ్ ఇక్బాల్.. అంతర్జాతీయ క్రికెట్ ను ఫాలో అయ్యేవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ సీనియర్ క్రికెటర్…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం కోల్పోయారు.…
సన్నిడియోల్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన జాట్ వచ్చే నెల ఏప్రిల్ 10…
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం.. పులివెందులలో రైతులకు భారీ కష్టం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు…