Political News

తెలంగాణ‌కు హైద‌రాబాద్‌.. ఏపీకి చంద్ర‌బాబు: నారా లోకేష్

గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌తో ఏపీ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు. అయితే.. ఏపీని ఆర్థికంగా, అభివృద్ది ప‌రంగా ముందుకు న‌డిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్న‌ట్టు తెలిపారు. తాజాగా ఆయ‌న ఓ మీడియా సంస్థ నిర్వ‌హిం చిన స‌ద‌స్సులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లు ఏపీ అవ‌కాశాలు త‌న్నుకుపోయే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌శ్న కు ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు. “తెలంగాణ‌కు హైద‌రాబాద్ వంటి న‌గ‌రం ఉంద‌ని.. మీరు భావిస్తున్నారు. అదేవిధంగా బెంగ ళూరు వంటి న‌గ‌రం క‌ర్ణాట‌క‌కు ఉంద‌ని చెబుతున్నారు. ఏపీకి ఏమీ లేక‌పోవ‌డం అనే మాటే లేదు. ఏపీకి చంద్ర‌బాబు ఉన్నారు. ఆయ‌న‌ను చూసి పెట్టుబ‌డులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వ‌స్తున్నారు. వ‌చ్చారు” అని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానిం చారు.

రాష్ట్రంలో పెట్టుబ‌డుల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేస్తున్నామ‌ని లోకేష్ తెలిపారు. సంప‌ద సృష్టి కోసం అనేక ప్ర‌య‌త్నాలు జ‌రుగుతు న్నాయ‌ని లోకేష్ తెలిపారు. అయితే.. రాత్రికి రాత్రి ఏదీ జ‌రిగిపోతుంద‌ని అనుకోవ‌డం లేద‌ని.. త్వ‌ర‌లోనే సాకారం అవుతాయ‌ని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. కూట‌మి ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌ని న‌మ్మ‌కంగా ప్ర‌జ‌లే చెబుతున్నాని లోకేష్ వ్యాఖ్యానించారు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ద్వారా ఏపీ వంటి ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కొంత న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పిన లోకేష్‌.. అయితే.. దీనిపై ఇప్పుడే తాము ఖంగారు ప‌డిపోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

అన్ని విష‌యాల‌పైనా కూటమిలో చ‌ర్చించుకుని నిర్ణ‌యం తీసుకుంటామ‌ని నారా లోకేష్ చెప్పారు. అయితే.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను కొంద‌రు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వినియోగించుకుంటున్నార‌ని తెలిపారు. దీనిని తాము ఖండించాల్సిన అవ‌స‌రం లేక‌పోయినా.. ఇలాంటి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటామ‌న్నారు. ఇక‌, హిందీ విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా నారా లోకేష్ చెప్పారు. మారుతున్న‌కాలాని అనుగుణంగా ప్ర‌తి ఒక్క‌రూ బ‌హు భాషా ప్రావీణ్యం పొందాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. భాష‌తో ఆదాయం కూడా వ‌స్తుంద‌ని.. త్వ‌ర‌లోనే ఏఐ సాంకేతిక‌త అందుబాటులోకి రానున్న‌నేప‌థ్యంలో భాషా పండితుల‌కు మ‌రింత మెరుగైన ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. మాతృభాష‌కు ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. అయితే.. హిందీని నేర్చుకోవ‌డం త‌ప్పుకాద‌నిత‌న ఉద్దేశంగా చెప్పారు. పైగా కేంద్రం కూడా జాతీయ నూత‌న విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని ప్ర‌తిపాదించినా.. ప్రాథ‌మిక స్థాయిలో మాతృభాష‌కు ప్రాధాన్యం ఇస్తున్న విష‌యాన్ని గుర్తించాల‌ని నారా లోకేష్ సూచించారు. ఏపీ విష‌యంలో తాము తెలుగుకే ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం.. అన్నీ తామేన‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పుకొచ్చారు.

This post was last modified on March 9, 2025 11:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

17 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago