జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే దువ్వాడపై రెండు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే, పవన్ ను కించపరిచేలా మాట్లాడిన దువ్వాడపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, దువ్వాడపై కేసుల పరంపర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా దువ్వాడపై గుంటూరులో మరో కేసు నమోదైంది.
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ మాణిక్యాల రావు గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రతి నెలా 50 కోట్లు ఇస్తున్నారంటూ దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ప్రకారం దువ్వాడపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో దువ్వాడకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశముంది.
అంతకుముందు, దువ్వాడపై కృష్ణా జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి హరిరామ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు సింగలూరి శాంతిప్రసాద్ తదితరులు కలిసి బందరు డీఎస్పీ రాజాకు దువ్వాడపై ఫిర్యాదు చేశారు. గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు పోలీస్ స్టేషన్లలో కూడా దువ్వాడపై చర్యలు తీసుకోవాలని స్థానిక జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఇక, పవన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, దువ్వాడపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on March 6, 2025 11:42 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…