జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు, పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న కొణిదెల నాగేంద్ర బాబు అలియాస్ నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ సీట్లన్నీ… అధికార కూటమి ఖాతాలోనే పడనున్నాయి. వైసీపీకి సరిపడినంత మంది ఎమ్మెల్యేలు లేని నేపథ్యంలో ఆ పార్టీ ఈ ఎన్నికల బరిలో కూడా నిలిచే అవకాశం లేదు. వెరసి మొత్తం 5 సీట్లు అధికార కూటమికే దక్కనున్నాయి.
ఈ 5 ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులుగా ఎవరెవరిని ఎంపిక చేయాలన్న దిశగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 5 సీట్లలో కూటమిలోని జనసేన, బీజేపీలు కూడా తమకూ ఒకటో, రెండో సీట్లను కోరే అవకాశం లేకపోలేదు. గతంలో ఆయా పార్టీల మధ్య జరిగిన సీట్ల సర్దుబాటు, అసెంబ్లీలో ఆయా పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్య, రాజకీయంగా ఆయా పార్టీలకు ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని 3 పార్టీలు సమన్వయంతోనే ముందుకు సాగుతున్నాయి. ఇప్పటిదాకా ఈ విషయంలో ఎలాంటి విభేదాలు లేవనే చెప్పాలి.
ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్… చంద్రబాబు వద్దకు వెళ్లారు. కాసేపు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని చర్చించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయం చర్చకు రాగా… గతంలో చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు నాగబాబుకు ఓ సీటును కేటాయిస్తున్నట్లు చంద్రబాబు చెప్పగా… అందుకు ప్రతిగా పవన్ కల్యాణ్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన 4 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత నాగబాబు సహా మిగిలిన అందరి పేర్లను ప్రకటించనున్నారు.
This post was last modified on March 4, 2025 9:49 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…