ఎస్ ఇది నిజం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ నేతకు ఎమ్మెల్సీ ఇవ్వడం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇగోను హర్ట్ చేసేలా ఉందన్న చర్చలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచే వేం నరేందర్‌రెడ్డి ఇంకా చెప్పాలంటే రేవంత్ తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచే రేవంత్‌కు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు.
వేం నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అవ్వడం వెనక ఓ చిన్న లింక్ ఉంది. దీనికో హిస్టరీ కూడా ఉంది. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డిని ఓటుకు నోటు కేసులో బుక్ చేసేందుకు స్టిఫెన్‌సన్‌ను ప్రయోగించారన్న ప్రచారం ఉంది. ఈ ట్రాప్ వెనక ఎవరి హస్తం ఉందన్న దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. అయితే వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేసేందుకే రేవంత్ అక్కడకు ఓటు అడిగేందుకు వెళ్లాడు.
అప్పట్లో తెలుగుదేశం నుంచి వేం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా బరిలో ఉన్నారు. ఆ రోజు ఆయన గెలిచేందుకు సరిపడా బలం తెలుగుదేశంకు ఉంది. కానీ బీఆర్ఎస్ కొంత మందిని ఆకర్షించింది. దీంతో నరేందర్‌రెడ్డి గెలుపు కష్టం అయ్యింది. అందుకే ముత్తయ్య అనే ఫాస్టర్ ద్వారా స్టీఫెన్సన్‌తో టీడీపీ వర్గాలు ఓటు కోసం ఏవేవో వ్యవహారం నడిపించారు. ఆయనతో రేవంత్ మాట్లాడేందుకు వెళ్లిన సమయంలో ట్రాప్ చేశారని రేవంత్ క్యాంపు ఆరోపిస్తోంది.
అప్పుడు వేం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగాను ఓడిపోయారు. కేసుల పాలయ్యారు. ఇప్పుడు అదే నేతను బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల సపోర్టుతోనే ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో రేవంత్ ఉన్నారట. ఇది ఇప్పుడు కేసీఆర్ ఇగోను హర్ట్ చేసేలా ఉందంటూ రేవంత్ క్యాంప్ మామూలుగా హైలెట్ చేయడం లేదు.
This post was last modified on February 28, 2025 1:49 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…