Political News

సీనియర్లంటే.. టిష్యూ పేపర్లలా కనిపిస్తున్నారా?

రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఏనాడూ విననన్ని సంచలన వ్యాఖ్యలు, వింత వ్యాఖ్యలు, వినూత్న పోలికలు వింటున్నాం. రాజకీయ రంగమైనా… ఇంకే రంగమైనా కూడా పాత నీరు పోతూ ఉంటే… కొత్త నీరు వస్తూనే ఉంటుంది కదా. అలాగని పాత తరం నేతలను కొత్త తరం నేతలు మరీ చులకనగా చూడకూడదు కదా. అదే సమయంలో తాము ఇంకా బరిలోనే ఉండగా… ఈ కొత్త నేతలు అవసరమా? అని పాత తరం నేతలూ భావించకూడదు కదా. ఈ రెండు భావనలూ తప్పే.

ఎవరు రమ్మన్నా… ఎవరు వద్దన్నా కూడా కొత్త నేతల ఎంట్రీ అయితే ఆగదు కదా. ఇలాంటి పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా అధికార కాంగ్రెస్ లో ఈ పరిణామాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త నేతలపై పాత తరం నేతలు కస్సుబుస్సులాడుతున్నారు. మీరు ఇంకెంత కాలం కొనసాగుతారంటూ కొత్త నేతలు కూడా పాత నేతలపై విరుచుకుపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకప్పుడు ఓ రేంజిలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం 40 ఏళ్లకు పైగా కష్టపడుతున్న తమకు ఇప్పుడు పార్టీలో కనీస గౌరవం కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవం మాట అటుంచితే.. సీనియర్ నేతలు అన్న కనీస ప్రాధాన్యం కూడా దక్కడం లేదని ఆయన వాపోయారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న చిన్నారెడ్డి.. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంచి ప్రాధాన్యమే దక్కింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. వనపర్తి నుంచి ఆయన 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకు వనపర్తి టికెట్ కేటాయించిన కాంగ్రెస్… ఆ తర్వాత ఎందుకనో గానీ ఆయనను తప్పించి మేఘారెడ్డికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ లెక్కన రేవంత్ హాయాంలోనూ చిన్నారెడ్డికి మంచి ప్రాధాన్యం దక్కినట్టే.

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా చిన్నారెడ్డి… తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. తనకు ఇచ్చిన టికెట్ ను దక్కించుకున్న మేఘారెడ్డి ఎన్నికల్లో విజయం సాధించడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీనియర్లను… ప్రత్యేకించి చిన్నారెడ్డిని అసలు పట్టించుకోవడం లేదట.

ఈ క్రమంలోనే పెబ్బేరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం ఓ పేరును చిన్నారెడ్డి ప్రతిపాదిస్తే.. మేఘారెడ్డి వేరే ఎవరికో దానిని ఇచ్చేశారట. దీంతో భగ్గుమన్న చిన్నారెడ్డి మీడియా ముందుకు వచ్చేశారు. పార్టీలో సీనియర్ నాయకులంటే.. టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద కావలిదార్లుగా పనిచేస్తున్నారని, మేఘారెడ్డి చెప్పిందే వేదంలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యేకు అధికారులు, పోలీసులు ఇంతలా భయపడటం తానెప్పుడూ చూడలేదన్నారు. పెబ్బేరు లాంటి చిన్న పట్టణాలకు చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అడిగే అర్హత కూడా తమకు లేదా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

This post was last modified on February 24, 2025 2:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇక్కడ 13 వేల కోట్ల స్కాం.. అక్కడ ఆమ్మాయికి దొరికేశాడు

భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…

3 minutes ago

సాయిరెడ్డి సీటు ఎవ‌రికిస్తారు బాబూ?

తాజాగా మ‌రో రాజ్య‌స‌భ సీటుకు సంబంధించి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయింది. వైసీపీ నాయ‌కుడు, కీల‌క నేత‌ల వేణుంబాకం విజ‌య‌…

1 hour ago

AI విప్లవం – సినిమా రంగంపై ప్రభావం

ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…

2 hours ago

అదే జ‌రిగితే.. తెలంగాణ‌ సీఎస్‌ను జైలుకు పంపిస్తాం: SC

తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరును…

2 hours ago

బాబు ‘అమ‌రావ‌తి’ క‌ల చాలా పెద్దది

ఏపీ సీఎం చంద్ర‌బాబు విష‌యం గురించి చెబుతూ… మంత్రి నారాయ‌ణ ఒక మాట చెప్పారు. "మ‌నం వ‌చ్చే రెండు మూడేళ్ల…

2 hours ago