మైక్ పట్టుకొని సాక్షి రిపోర్టర్ తో లోకేష్ పంచులు!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తనదైన మార్క్ రాజకీయంతో దూసుకుపోతున్నారు. 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఉన్న పార్టీకి రాత్రికి రాత్రి… 135 ఎమ్మెల్యే సీట్లు, 18 ఎంపీ సీట్లు కలిగిన పార్టీగా టీడీపీకి బలమైన కం బ్యాక్ ఇచ్చారు. రాజ్యసభలో జీరో స్థాయికి చేరిన టీడీపీ సంఖ్యను ఆరంటే ఆరు నెలల్లోనే తిరిగి ఖాతా ఓపెన్ అయ్యేలా చేశారు.

అంతేనా… వైరి వర్గాలపై ఆయన చేస్తున్న సెటైరిక్ విమర్శలు అంతకంతకూ పదునెక్కుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే… వైసీపీపైనా, ఆ పార్టీ పత్రికగా ముద్ర పడిన సాక్షి మీడియాపైనా లోకేశ్ చేస్తున్న ర్యాగింగ్ డోస్ మరింత పెరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రాజకీయంగా తనను నిత్యం టార్గెట్ చేస్తున్న సాక్షి మీడియాను చూసి దూరం వెళ్లడానికి బదులుగా… సాక్షి మీడియాను టార్గెట్ చేయడాన్ని లోకేశ్ చాలా కాలం క్రితమే మొదలుపెట్టారు. ఎక్కడ మీడియా సమావేశం పెట్టినా…సాక్షి ఎక్కడబ్బా… ఎవరు వచ్చారు సాక్షి నుంచి… అంటూ సెటైర్లు సంధించే లోకేశ్… ఎంటీ సాక్షి రాలేదా?.. అంత భయమైతే ఎలాగబ్బా… అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సాగారు.

ఇక తన మీడియా సమావేశాలకు హాజరయ్యే సాక్షి ప్రతినిధులను పిలిచి మరీ బాగున్నారా? అంటూ పలరిస్తూ కూడా లోకేశ్… ఆ పలకరింపులోనూ తనదైన వ్యంగ్యాన్ని జోగించి సాక్షికి బీపీ పెంచేవారు.

తాజాగా శనివారం విశాఖ వచ్చిన సందర్బంగా కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా లోకేశ్ తన ర్యాగింగ్ డోస్ ను మరింతగా పెంచారు. ”సాక్షి వచ్చాడా అబ్బా… ఎవరు?..ఎవరొచ్చారు?…ఏడీ?… ఎక్కడ?.. మీరేనా?… బాగున్నారా?… ఏంటీ?.. చాలా రోజుల తర్వాత మేడం గారు ఆఫీస్ కు వెళ్లారంట….”.అంటూ లోకేశ్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. నిన్నటిదాకా సాక్షి ప్రతినిధులతోనే ఆడుకున్న లోకేశ్… ఇప్పుడు ఏకంగా సాక్షి మీడియా అధినేత్రిగా ఉన్న వైఎస్ భారతిని కూడా ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తూ… సాక్షిపై తన ర్యాగింగ్ డోస్ ను అమాంతంగా పెంచేశారు.