పంకజశ్రీ.. ప్రస్తుతం ఈ పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమె గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీమణి. ప్రస్తుతం వంశీ అరెస్టయి.. జైల్లో ఉన్న నేపథ్యంలో ఆమె మీడియా ముందుకు వచ్చారు. కుట్ర, కిడ్నాప్ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి.. వంశీని అరెస్టు చేయడం..గురువారం, శుక్రవారం చర్చగా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులోనే కోర్టు ఆయనకు 14 రోజలు రిమాండ్ విధించింది. అనంతరం విజయవాడ జైలుకు తరలించారు.
శనివారం ఉదయం వంశీ సతీమని పంకజశ్రీ జైలుకు వచ్చి.. భర్తను పరామర్శించారు. సుమారు 20 నిమి షాలపాటు.. భార్యాభర్తలు.. చర్చించుకున్నారు. అనంతరం పంకజ శ్రీ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు కేసు ప్రూవ్ కాకుండా(నిర్ధారణ)నే అరెస్టు చేశారని.. తీసుకువచ్చి నాలుగు గోడ ల మధ్య కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నా.. కనీసం కుర్చీ కూడా ఇవ్వలేదని.. కింద కూర్చోకూడదని, పడుకోకూడదని చెబుతున్నా.. అధికారులు వినిపించుకో లేదన్నారు.
చార్లెస్ శోభరాజ్‌నో.. కరడు గట్టిన నేరస్తులను అరెస్టు చేసినట్టు వంశీని అరెస్టు చేశారని పంకజ శ్రీ వ్యాఖ్యా నించారు. ఆయనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని అన్నారు. సో.. ఇంకా ఏవో ఏవో అనేశారు. ఇదంతా బాధ.. ఆవేదన ఏదైనా కావొచ్చు. కట్ చేస్తే.. నాడు చంద్రబాబును అరెస్టు చేసిన వ్యవహారంలో నూ ఇలానే జరిగినప్పుడు పంకజ శ్రీవంటి ఉన్నత విద్యావంతురాలు(ఆమె డాక్టర్) కనీసం ఖండించలే దే.. అని టీడీపీ మహిళా విభాగం ప్రశ్న. నాడు చంద్రబాబుపై ఏ రుజువు ఉందని కర్నూలులో తెల్లవారు జామున అరెస్టు చేశారని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు.. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయినా.. కనీసం కుషన్ చైర్ కూడా ఏర్పాటు చేయకుం డా చెక్క కుర్చీలో కూర్చోబెట్టి.. లైటు తీసేసి.. తిరగని ఫ్యాన్ పెట్టి వేధించినప్పుడు.. పంకజ శ్రీ స్పందించి ఉండాల్సిందని.. జగన్ పాలనలో ఇంతకన్నా ఎక్కువగానే జరిగిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ.. ఇప్పుడు చట్ట ప్రకారం అన్ని ఆధారాలతోనే వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా పంకజశ్రీ చేసిన వ్యాఖ్యలు.. గతాన్ని గుర్తు చేస్తున్నాయని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.