ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాగించిన పాలనలో విధ్వంసం చోటుచేసుకుందని, రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిత్యం ఆరోపిస్తూనే ఉన్నారు. ఏపీలో మరోమారు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు ఆయా శాఖలను పరిశీలిస్తూ సాగుతుండగా.. జగన్ సాగించిన దురాగతాలు వరుసబెట్టి బయటకు వస్తున్నాయన్నది టీడీపీ మాట.
ఆయా శాఖల్లో తన సొంత మనుషులను నియమించుకున్న జగన్… తనకు అనుకూలంగా పనులన్నీ చక్కబెట్టుకున్నారని వైసీపీ హయాంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
అంతేకాకుండా వైసీపీకి చెందిన వారికి, జగన్ కు సహకరించిన సోషల్ మీడియా యాక్టివిస్టులకు కూడా పెద్ద ఎత్తున సర్కారీ కొలువులను కట్టబెట్టారని తేలింది. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో ఏకంగా వందలాది మంది వైసీపీ కార్యకర్తలను నియమించి… వారికి లక్షలాది రూపాయల వేతనాలను అందించారని తేలింది.
ఈ జాబితాలను బయటపెట్టిన ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి… ఒక్క సంతకంతోవైసీపీ అనుకూల ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించారు.
మొత్తంగా జగన్ ఏపీలో తన సొంత మనుషులతో విధ్వంస పాలన సాగించారని ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి దుస్సంప్రదాయం దేశ రాజధాని ఢిల్లీలోనూ జరిగిందన్న వాదనలు కలకలం రేపుతున్నాయి. జగన్ ను చూసి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేర్చుకున్నారో.. లేదంటే… కేజ్రీని చూసి జగనే నేచ్చుకున్నారో తెలియదు గానీ… ఏపీ తరహా పాలనే ఢిల్లీలోనూ సాగిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. జగన్ మాదిరే కేజ్రీ కూడా అన్ని శాఖల్లో తన సొంత వారిని నియమించుకుని విధ్వంస పాలనకు తెర తీశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా… బీజేపీ చేతిలో ఆప్ చిత్తుగా ఓడింది. కేజ్రీ పార్టీ ఓడిపోగానే… ఢిల్లీ సచివాలయాన్ని అష్ట దిగ్బంధనం చేసిన లెఫ్ట్ నెంట్ గవర్నర్ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పూర్వాశ్రమంలో ఇండియన్ రెవెన్యూ సర్వీసు అధికారి అయిన కేజ్రీ…పాలనను తన చెప్పు చేతల్లోకి తీసుకునేందుకు అన్ని రకాల కుయుక్తులను ప్రయోగించారన్నది బీజేపీ ఆరోపణ.
ఈ క్రమంలో ఆప్ ఓడగానే.. తన తప్పులకు సంబంధించిన ఆధారాలను కేజ్రీ ఎక్కడ మాయం చేస్తారోనన్న అనుమానంతోనే లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
సచివాలయాన్నిదాదాపుగా సీజ్ చేస్తూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనన్న వాదనలు తాజాగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ సర్కారులోని దాదాపుగా అన్నిశాఖల్లో కేజ్రీ తన సొంత మనుషులను నియమించుకున్నారట. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా.. అత్యంత రహస్యంగా జరిగాయట.
ఈ వ్యవహారంపై పక్కా ఆధారాలు సేకరించిన లెఫ్ట్ నెంట్ గివర్నర్ ఇప్పుడు అన్నిశాఖలకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. మీమీ శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలు, ప్రస్తుతం పనిచేస్తున్న అలాంటి ఉద్యోగుల వివరాలు అందజేయాలని ఆయన ఆ ఆదేశాల్లో పేర్కొన్నారట. మరి కేజ్రీ… నిజంగానే ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో త్వరలోనే తేలనుందన్న మాట.