నిజమే. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును భయపెట్టడం అంత ఈజీ కాదు. అసలు చంద్రబాబును భయపెట్టాలని ఆలోచన ఏ ఒక్కరికి రాదు కూడా. ఎందుకంటే.. రాజకీయాల్లో చంద్రబాబు ఆరితేరిపోయారు. వ్యూహాలు అమలు చేయడంలో ఆయన రాటుదేలి పోయారు. ఎప్పుడు ఏ మాట చెబితే సరిపోతుందన్న విషయం బాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చినా.. వాటి అమలులో వస్తున్న సమస్యలను ప్రజలకు చెప్పడంలోనూ చంద్రబాబు భయపడరు. వాస్తవ పరిస్థితిని జనానికి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు మరి.
సంక్షేమ పథకాలను అమలు చేయడం అంటే… ఆయా పథకాలు అర్హులకు అందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టు. ఆలా కాకుండా… అనర్హులకు కూడా ఆయా పథకాలు అందితే… ఇక అర్హులకు న్యాయం జరిగేదెట్టా? నిజమే… అనర్హులకు సర్కారీ పథకాలు అందితే… అర్హులకు అన్యాయం జరిగినట్టే. చంద్రబాబు కూడా ఇలాగె ఆలోచిస్తారు. గత ప్రభుత్వాలు ఇచ్చాయి కదా… ఇపుడు మనం ఎందుకు అనర్హులంటూ కొందరికి సంక్షేమ పథకాలను ఆపాలి అని చంద్రబాబు ఆలోచించరు. ప్రత్యర్థులు అనర్హులకు పథకాలు అందిస్తే.. ఆ తప్పు మనం ఎందుకు చేయాలి అని చంద్రబాబు ప్రశ్నిస్తారు.
ఇప్పుడు చంద్రబాబు ఇదే పని చేస్తున్నారు. పింఛన్లు, ఇళ్ల స్థలాల పంపిణీపై సమీక్ష జరిపిన సందర్హంగా చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పింఛన్లు, ఇళ్ల స్థలాల విషయంలో నిక్కచ్చిగా పరీశీలన జరపాలని ఆయన అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేస్తే పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అధికారులతో పాటుగా పలువురు మంత్రులు చెప్పగా.. వస్తే రానీ అని చంద్రబాబు అన్నారట. సంక్షేమ పథకాలు అంటేనే పేదలకు అందాల్సిన పథకాలని… అలాంటి పథకాలు అనర్హులకు అందుతుంటే… కళ్ళు మూసుకుని, చేతులు ముడుచుకుని… చేష్టలు అడిగి ఉండిపోవాలా అని చంద్రబాబు అన్నారట. అర్హుల జాబితాపై పరిశీలన పక్కాగా జరగాల్సిందేనని.. అనర్హుల పేర్ల తొలగింపు జరగాల్సిందేనని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates