“జ‌గ‌న్‌ది.. పొలిటిక‌ల్ రేప్‌.. నా మాట విను!”

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయకుడు సాకే శైల‌జానాథ్‌.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న సాకే.. వైఎస్ హ‌యాంలో కీల‌క రోల్ పోషించారు. విభ‌జిత రాష్ట్రంలో ఏపీ కాంగ్రె స్ అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశారు. అయితే.. ఆయ‌న తాజాగా వైసీపీ పంచ‌న చేరి ఆ పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. అయితే.. సాధార‌ణంగా ఎవ‌రైనా పార్టీ మారితే.. సూచ‌న‌లు, స‌ల‌హాలు కామ‌నే. కానీ, సాకే విష‌యం లో కొన్ని హెచ్చరిక‌లు కూడా వ‌చ్చాయి.

సాకే స్నేహితుడు.. గ‌తంలో ఇరువురు క‌లిసి ఒకే ప్ర‌భుత్వంలో మంత్రులుగా కూడా ప‌నిచేసిన డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావు సంచ‌ల‌న సూచ‌న‌లు, హెచ్చ‌రిక‌లు కూడా చేశారు. వైసీపీలో చేరితే వ‌చ్చేది ఏమీ లేద‌ని.. బూడిద త‌ప్ప‌! అని వ్యాఖ్యానించారు. ముందు చేరేప్పుడు.. చాలా ప్రేమాభిమానాలు కురిపిస్తార‌ని.. కానీ, త‌ర్వాత‌.. రాజ‌కీయ అత్యాచారం చేస్తార‌ని జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తాను కూడా వైసీపీ బాధితుడినేన‌ని మాణిక్యం అన్నారు. “నా మాట విను. జ‌గ‌న్‌ది పొలిటిక‌ల్ రేప్ మ‌న‌స్తత్వం. ముందు బాగానే ఉంటుంది. త‌ర్వాత‌.. సినిమా చూపిస్తాడు” అని వ్యాఖ్యానించారు.

విలువ‌లు విశ్వ‌స‌నీయ‌త అనేది.. కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితమ‌ని.. జ‌గ‌న్ అంత దుర్మార్గ మ‌న‌స్త‌త్వం ఉన్న నాయ‌కుడిని త‌న 30 ఏళ్ల రాజ‌కీయాల్లో ఎప్పుడూ చూడ‌లేదని మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ వ్యాఖ్యానించారు. వైసీపీ అంటే మాదిగ‌ల‌కు వ్య‌తిరేక పార్టీ అని. ఇప్ప‌టికే అనేక మంది బాధితులుగా ఉన్నార‌ని.. ఇప్పుడు ఆపార్టీలో చేరి నువ్వు కూడా ఇబ్బందులు కొనితెచ్చుకోవ‌ద్ద‌ని మాణిక్యం సూచించారు. రాజ‌కీయ ఫ్యూచ‌ర్ కోరుకుంటే.. వైసీపీలో చేర‌కుండా ఉండ‌డ‌మే మంచిద‌ని వర ప్రసాద్ సలహా ఇచ్చారు. అయితే.. ఆయన నేరుగా కూట‌మి పార్టీల్లో చేరాల‌ని మాత్రం స‌ల‌హా ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.