ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగైనా అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని ఆప్ అనుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం అంచనాలకు మించింది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పోలింగ్ పూర్తయ్యే సరికి ఆ శాతం దాదాపు 61కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

2020 ఎన్నికలతో పోలిస్తే 13 శాతం పోలింగ్‌ అధికరంగా జరిగే చాన్స్ ఉంది. అయితే, ఆ పెరిగిన ఓట్ల శాతం ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం అన్నది తేలాల్సి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ, ఆప్ ల మధ్య గట్టిపోరు తప్పదని దాదాపుగా మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ అఖండ విజయాన్ని పక్కాగా అంచనా వేసిన కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆప్ గెలుపును తేల్చేశాయి. ఈ ఎన్నికల్లో ఆప్‌ 39, బీజేపీ 22 సీట్లు దక్కించుకుంటాయని కేకే సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో ఈ ఫలితాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండడంతో ఆప్ నేతలు తమ గెలుపు ఖాయమని అనుకుంటున్నారు. అయితే, చాణక్య స్ట్రాటజీస్ మాత్రం బీజేపీ 51-60 సీట్లతో అధికారం చేపడుతుందని తేల్చింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు:

పీపుల్స్‌ పల్స్‌: బీజేపీ 51-60, ఆప్‌ 10-19

ఏబీపీ మ్యాట్రిజ్‌: బీజేపీ 35-40, ఆప్‌ 32-37

ఆత్మసాక్షి: బీజేపీ 38-41, ఆప్‌ 27-30, కాంగ్రెస్‌ 1-3

చాణక్య స్ట్రాటజీస్‌: బీజేపీ 39-44, ఆప్‌ 25-28

ఢిల్లీ టౌమ్స్‌ నౌ: బీజేపీ 39-45, ఆప్‌ 22-31