తెగించినోడికి తెడ్డే లింగం! కానీ, అన్నా.. ఏదైదే అదేజరుగుతుంది!
– తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ అసమ్మతి నాయకుడు, వైసీపీ సానుకూల నేత వల్లభనేని చేసిన వ్యాఖ్యలు ఇవేనని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒక్కసారిగా ఆయన ఇంత మాట ఎందుకు అన్నారు? నిన్నమొన్నటి వరకు అందరినీ కలుపుకొని వెళ్తానని చెప్పిన వంశీలో మారిన వైఖరి ఏంటి? ఇప్పుడు అందరి ఆలోచింప చేస్తున్న ప్రశ్నలు ఇవి. వరుస విజయాలతో టీడీపీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వంశీకి కమ్మ వర్గం మంచి పేరుంది.
టీడీపీలోని కమ్మలు ఆయనకు ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నారు. ఆయన కూడా పార్టీని విమర్శించ లేదు. కేవలం చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. పరుష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఇదిలావుంటే, వైసీపీలోకి వంశీ రావడం దగ్గర నుంచి ఆయనపై విరుచుకుపడుతున్న వైసీపీనాయకులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు.. వంశీ విషయంలో దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో జగన్ వారికి నచ్చజెప్పినా.. వినిపించుకునే పరిస్థితిలో లేరు. గన్నవరం ఇంచార్జ్‌గా వంశీ తనను తాను ప్రకటించుకోవడం, కార్యక్రమాలు నిర్వహించడం వంటివి వీరికి అస్సలు ఇష్టం లేదు.
ఈ నేపథ్యంలో పైకి బాగానే ఉన్నామని సంకేతాలు ఇస్తూనే.. వంశీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సోషల్ మీడియాకు లీకులు ఇస్తున్నారు. అంటే.. వంశీ విషయంలో రేపు రాజకీయ ఒత్తిడి వచ్చి.. వైసీపీ అధినేత జగన్ ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే.. పట్టుబట్టి ఓడించాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే.. టీడీపీ నేతలతో కూడా చేతులు కలిపి.. వంశీని ఓడించాలని, ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని నేతలు భావిస్తున్నారట.
ఆయా విషయాలపై సమాచారం అందుకున్న వంశీ.. ఏకం కానీ.. చూద్దాం. వాళ్లో నేనో తేలిపోతుంది. లాస్ట్ టైమ్ ఎన్నికల్లోనూ ఇలానే చేశారు. ఏం పీకారు?
అని వ్యాఖ్యానించారు. దీంతో వంశీ ఇక, తెగించేసినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఆయన గెలుపు ఖాయమేనని, సానుభూతిపరులు బాగానే ఉన్నారని. అయితే, మెజారిటీ తగ్గితే తగ్గవచ్చని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 19, 2020 11:23 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…