‘మహానటి’తో కీర్తి సురేష్ జాతకమే మారిపోయింది. అంతకుముందు ఆమెను అందరు హీరోయిన్లలో ఒకదాని లాగే చూశారు. కానీ ‘మహానటి’తో ఒకేసారి నటిగా ఎన్నో మెట్లు ఎక్కేసి తన ప్రత్యేకతను చాటుకుంది కీర్తి. ఇక అప్పట్నుంచి ఆమె పేరు మీదే సినిమాలు సేల్ అవుతున్నాయి. కీర్తి ప్రధాన పాత్రలో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మొదలయ్యాయి. అందులో ఒకటి ‘మిస్ ఇండియా’.
తెలుగులో నువ్విలా, 118 లాంటి సినిమాలు నిర్మించిన మహేష్ కోనేరు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. నరేంద్ర నాథ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. కీర్తి నటించిన పెంగ్విన్, గుడ్ లక్ సఖి చిత్రాల కంటే ముందే ‘మిస్ ఇండియా’ మొదలైంది. వేసవి ఆరంభంలోనే రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా కరోనా వల్ల వెనక్కెళ్లిపోయింది.
ఐతే ఈ లోపు ‘పెంగ్విన్’ పూర్తయి అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైపోయింది. ఆ సినిమాకు విడుదల ముంగిట బాగానే ప్రచారం లభించింది. ఇక ‘గుడ్ లక్ సఖి’ విషయానికి వస్తే దిల్ రాజు ప్రొడక్షన్ కావడం, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేయడం, జగపతిబాబు కీలక పాత్ర చేయడం వల్ల దీనికి ముందు నుంచి మీడియాలో మంచి ప్రాధాన్యమే లభిస్తోంది.
కరోనా తర్వాత షూటింగ్ పున:ప్రారంభించడం, టీజర్ కూడా రిలీజ్ చేయడంతో ఇది తరచుగా వార్తల్లో ఉంటోంది. కానీ ‘మిస్ ఇండియా’ గురించి అసలు చప్పుడు లేదు. దీని గురించి ఒక అప్ డేట్ లేదు. మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ పబ్లిసిటీ లేదు. అసలు సినిమా పూర్తయింది లేనిది కూడా తెలియట్లేదు. ఓటీటీ రిలీజ్ అన్నారు కానీ.. దాని గురించి కూడా సమాచారం లేదు. కీర్తి కూడా ఎప్పుడూ ఈ సినిమా ఊసే ఎత్తట్లేదు. దీన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకుంటే.. ముందు నుంచి వార్తల్లో నిలబెట్టి జనాల్లో ఆసక్తి రేకెత్తించడం చాలా అవసరం. మరి దీని మేకర్స్ ఈ సినిమాను ఎందుకు అలా మరుగున పడేశారన్నది అర్థం కాని విషయం.
This post was last modified on October 19, 2020 12:22 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…