పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాలు చేశారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు. వీరిలో బీద మస్తాన్ రావు(టీడీపీ), వల్లభనేని బాలశౌరి(జనసేన), పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి(వైసీపీ) ఉన్నారు. ఏపీ తరఫున ఈ సమావేశానికి హాజరైన ఈ ముగ్గురిని చూసినంతనే ఏపీ జనం వారి మార్గాలపై ఆసక్తికర పయనాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల దాకా ఈ ముగ్గురు కూడా వైసీపీ నేతలుగానే కొనసాగారు. అంతేకాకుండా వైసీపీ తరఫున ఈ ముగ్గురు ఎంపీలుగానే కొనసాగారు. అంతేకాదండోయ్… నాడు వీరు ఏఏ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించారో ఇప్పుడు కూడా అవే ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ముర్గురి దారులు మాత్రం వేరు అయిపోయాయి. దానిపైనే ఏపీ జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. రాజంపేట నుంచి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నఆయన ఆది నుంచి వైసీపీలోనే ఉన్నారు. మూడు పర్యాయాలు కూడా ఆయన రాజంపేట నుంచే విజయం సాధించారు. ఇక టీడీపీ తరఫున భేటీకి హాజరైన బీద మస్తాన్ రావు మొన్నటిదాకా వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత మోపిదేవి,వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి… రాజ్యసభలో తన రాజీనామాతో ఖాళీ అయిన సీటునే ఆయన తిరిగీ దక్కించుకున్నారు.
ఇక వల్లభనేని బాలశౌరి కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఎంపీగా కొనసాగుతున్నారు. 2019లోనూ ఆయన ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. అయితే నాడు ఆయన వైసీపీ అభ్యర్థిగా గెలవగా… మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఇదిలా ఉంటే… అటు వైసీపీ, ఇటు జనసేనతో పాటుగా…గతంలో ఓ సారి టీడీపీ తరఫున కూడా బాలశౌరి మచిలీపట్నం నుంచే ఎంపీగా గెలిచారు. ఇలా మొన్నటిదాకా ఒకే పార్టీలో సాగిన ఈ ముగ్గురు మూడు వేర్వేరు పార్టీల తరఫున భేటీకి హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.
This post was last modified on January 30, 2025 12:30 pm
నాగపూర్‌కు చెందిన ఆకాష్ హోలే, దివ్య లోహకారే హోలే దంపతులు కేవలం 400 చదరపు అడుగుల గదిలో ఎటువంటి నేల…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయంగా, పాలనా పరంగా సత్తా చాటుతున్నారు. 42…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఢిల్లీలో గురువారం జరిగే…
పుష్ప 2 ది రూల్ లో ఎక్కువ ప్రాధాన్యం దక్కలేదు కానీ పుష్ప 1 ది రైజ్ లో జాలీ…
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం స్థలాన్ని వెతుకుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఈ ప్రాజెక్ట్…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి విడుదలయ్యే నిధులు ఏవైనా కూడా... వాటిలో ఏపీకి అగ్ర తాంబూలం లభిస్తోంది. మొన్నటికి మొన్న…