ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసిబాబు అనే పేరు పదే పదే వినిపిస్తోంది. ఇతడేమీ పెద్ద రాజకీయవేత్త కాదు. అలాగని బిజినెస్ మ్యాన్ కూడా కాదు. మరి సోషల్ వర్కరా? అంటే… కానే కాదు. మరెవరు? ఇతడి పేరు ఇంతగా ఎందుకు వినిపిస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన తులసిబాబు… సోమవారం పోలీసుల కస్టడీలోకి వెళ్లియారు. బుధవారం వరకు అతడిని పోలీసులు 3 రోజులు వరుసగా విచారించి తిరిగి జైలుకు తరలించారు. ఈ విచారణలో తేలిన అంశాలతో అతడికి ఈ స్థాయి ప్రచారం దక్కడం న్యాయమేనన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఎక్కడో గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో నమోదు అయిన కేసు విచారణ… కేవలం తులసిబాబు స్టామినా కారణంగా ఒంగోలుకు బదిలీ అయిపోయింది.ఒంగోలులోనూ అతడిని ఓ ఎస్సై, సీఐ స్థాయి అధికారో విచారించలేదు. స్వయంగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆతడిని విచారించారట. కోర్టుకు తరలించే సమయంలోనూ స్వయంగా జిల్లా ఎస్పీనే అతడికి సంబంధించిన అన్ని పత్రాలు పరిశీలించి…దగ్గరుండి మరీ కారు ఎక్కించి పంపించిన తీరు చూస్తుంటే… తులసిబాబు నిజంగానే ఓ రేంజి స్టామినా కలిగిన వాడిగా చెప్పక తప్పదు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయనపై గుంటూరు సీఐడీ కార్యాలయంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ సందర్భంగా భారీకాయుడైన తులసిబాబును అక్కడికి రప్పించి… అతడిని రఘురామ గుండెలపై కూర్చోబెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రఘురామ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేయగా… తులసిబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీలోని ఏ ఒక్క అధికారి కూడా సాహసం చేయలేకపోయారట. దీంతోనే ఈ కేసు విచారణలో స్వయంగా కలుగజేసుకున్న డీజీపీ… ఇలాగైతే కాదని భావించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ను ఈ కేసు విచారణాధికారిగా నియమించి… కేసు విచారణను కూడా ఒంగోలుకు బదిలీ చేశారు.
ఇక 3 రోజుల విచారణ సందర్భంగా తులసిబాబుకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను దామోదర్ బయటకు తీశారు. లా చదివిన తులసిబాబు గతంలో సీబీఐ న్యాయ సలహాదారుగా పనిచేశారట.అంతేకాదండోయ్… బిగ్ బాస్ టీం పేరిట రియాలిటీ షోకు కంటెస్టెంట్లను ఎంపిక చేసేది తానేనని కూడా అతడు దందా సాగించాడట. ఇక బిగ్ బాస్ కోర్ టీం పేరిట కూడా అతడు బాగానే దండుకున్నాడట. ఈ నిధులతో తులసిబాబు దుబాయిలో ఏకంగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీనే తెరిచాడట. వైసీపీ జమానాలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ తో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కారణంగానే సునీల్ పిలుపుతోనే అతడు రఘురామపై థర్డ్ డిగ్రీలో పాలుపంచుకున్నాడట.
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తులసిబాబు.. ఎలా వచ్చారో తెలియదు గానీ.. కృష్ణా జిల్లా గుడివాడలో ఓ కీలక వ్యక్తిగా రాణిస్తున్నాడు. గతంలో అక్కడి నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కొడాలి నానికి ముఖ్య అనుచరుడిగా సాగిన తులసిబాబు… ఇప్పటి ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతోనూ అంతకంటే కూడా సన్నిహితంగా మెలగుతున్నారు. అంతేకాదండోయ్… మొన్నటి ఎన్నికల్లో కొడాలి ఓటమి, వెనిగండ్ల గెలుపులో తులసిబాబుదే కీలక భూమిక అట. ఈ కారణంగానే తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేసినంతనే వెనిగండ్ల రాము అతడి పరామర్శకు పరుగులు పెట్టారని తెలుస్తోంది. మరి ఈ కేసులో తులసిబాబుకు శిక్ష పడుతుందో.. లేదంటో తన మాస్టర్ మైండ్ తో ఎంచక్కా బయటపడిపోతాడో చూడాలి.
This post was last modified on January 30, 2025 9:53 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…