వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన మరో ఫొటో బుధవారం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. వైరల్ గానూ మారిపోయింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ లండన్ వీధుల్లో ఓ పిల్లాడిని చేతుల్లో ఎత్తుకుని కనిపించారు. జగన్ తన చేతుల్లోని పిల్లాడి మాదిరిగానే… అక్కడి చలిని తట్టుకునేందుకు ఎంచక్కా జీన్స్ ప్యాంట్, టీ షర్ట్.. ఆ టీ షర్ట్ పై బీగీ జాకెట్ వేసుకుని కనిపించారు. జగన్ చేతిలోని పిల్లాడి తలకు మఫ్లర్ ఉండగా… జగన్ తలకు మాత్రం మఫ్లర్ కనిపించలేదు.
అంత చలిలోనూ చిరునవ్వులు చిందిస్తూ.. పిల్లాడిని చేతిలో పట్టుకుని నిలబడిన జగన్ ను ఫొటో తీసిన ఆయన అభిమాని ఒకరు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా…అదే ఇప్పుడు వైరర్ గా మారిపోయింది. లండన్ వీధుల్లో జగన్ అలా తిరుగుదామని బయటకు రాగా… అక్కడే ఉంటున్న ఓ తెలుగు యువకుడు జగన్ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడట. తన పిల్లాడిని జగన్ చేతిలో పెట్టాడట. ఆ పిల్లాడిని జగన్ ఎత్తుకున్న సందర్భంగా మరో వ్యక్తి జగన్ ను తన కెమెరాలో బంధించారట.
తన కుమార్తె గ్రాడ్యుయేషన్ సెరీమనీ కోసం ఇటీవలే సతీ సమేతంగా జగన్ లండన్ టూర్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న జగన్ తిరిగి తాడేపల్లి చేరనున్నారు. ఇదిలా ఉంటే… చలికి వణికిపోతున్న జగన్ ఫొటోను చూసిన వారు ఇటీవలి దావోస్ టూర్ లో కనిపించిన చంద్రబాబు ఫొటోలను గుర్తు చేసుకుంటున్నారు. దావోస్ లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో చలికి అంతా వణికిపోగా… చంద్రబాబు మాత్రం రెగ్యులర్ దుస్తులతోనే కనిపించి.. వయసు మీద పడ్డా తనను చలి ఏమీ చేయలేదన్నట్లుగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే నిత్యం వయసును ప్రస్తావిస్తూ చంద్రబాబును హేళన చేసే జగన్… లండన్ లో ఇలా నిండా స్వెట్టర్లతో కనిపించిన వైనాన్ని వారు గుర్తు చేస్తూ సైటర్లు సంధిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates