మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఇటీవల కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామంటూ జనసేన నేతలు కొందరు వ్యాఖ్యానించారు.
అయితే, ఆ తర్వాత ఇరు పార్టీల హై కమాండ్ ఆ వ్యవహారాల గురించి మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఆ ఇష్యూ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం పదవిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు అనడం సరికాదని గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, చంద్రబాబు ఉన్నంత కాలం ఆయనే సీఎం అని గోరంట్ల తేల్చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని, అటువంటప్పుడు లోకేష్ కు ఎందుకు ఇవ్వడం అని గోరంట్ల ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని ప్రతిపాదించామని గుర్తు చేశారు. పార్టీని బ్రతికించుకోవడం కోసం కష్టపడ్డ లోకేశ్ కు సముచిత స్థానం ఇప్పటికే దక్కిందని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం ఆయనే సీఎం అని అన్నారు. మధ్యలో అనవసరమైన వివాదాల జోలికి వెళ్లడం నాయకులకు మంచిది కాదని హితవు పలికారు.
ఇక, విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారంపై గోరంట్ల స్పందించారు. అటువంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమిలోని ఏ పార్టీ చేర్చుకోదని తాను భావిస్తున్నానని గోరంట్ల చెప్పారు. విశాఖ కేంద్రంగా విజయసాయి వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడని, అనేక సంస్థలను మోసం చేసి, కబ్జాలు చేసి వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు.
ఆ మొత్తాన్ని రికవరీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు. ఇక, కాకినాడ సీ పోర్టు అల్లుడికి అప్పగించాడని, విజయసాయికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఆనాడు..ఈనాడు విజయసాయి రెండో ముద్దాయి అని, జగన్ మొదటి ముద్దాయి అని చెప్పారు.
This post was last modified on January 28, 2025 6:05 pm
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…