Movie News

రవితేజ విజ్ఞప్తికి విముక్తి

రవితేజ ఇమేజ్‌ ఛట్రం నుంచి బయటికి వచ్చి, ‘మాస్ రాజా’ అనే ట్యాగ్‌ను కూడా పక్కన పెట్టి చేసిన సినిమా.. భర్త మహాశయులకు విజ్ఞప్తి. ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైంది. ఐతే రివ్యూలు, టాక్ యావరేజ్‌గా రాగా.. ఫలితం కూడా అందుకు తగ్గట్లే వచ్చింది.

సంక్రాంతి పండుగ అడ్వాంటేజ్‌ను ఓమాదిరిగా ఉపయోగించుకున్న ఈ మూవీ.. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే కొంచెం మెరుగైన ఫలితాన్ని అందుకుంది. ఐతే మిగతా సంక్రాంతి సినిమాలన్నీ గత నెలలోనే ఓటీటీలోకి వచ్చేయగా.. రవితేజ మూవీ మాత్రం ఇంకా డిజిటల్ ప్రేక్షకులను పలకరించలేదు. థియేటర్లలో సినిమాను మిస్సయిన వాళ్లు.. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తుంటే అది ఎంతకీ స్ట్రీమింగ్‌కు రాలేదు. ఓటీటీ డీల్ విషయంలో ఏదో ఒక సమస్య వల్ల స్ట్రీమింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఐతే ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని.. అతి త్వరలోనే ‘భర్త మహాశయులకు’ టీవీ, మొబైల్ ప్రేక్షకులను పకలరించబోతోందని సమాచారం. మార్చి 13 నుంచి జీ5లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. జీ స్టూడియోస్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంది.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కంటెంట్ పరంగా యావరేజే కానీ.. ఇందులో కొన్ని హైలైట్లు ఉన్నాయి. రవితేజ తన ఇమేజ్‌కు భిన్నంగా ఒక సాధారణ భర్త పాత్రలో కనిపించడం.. హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతిల అందచందాలు.. కొన్ని కామెడీ సీన్లు.. పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఇదిలా ఉండగా.. సంక్రాంతి తర్వాత తమిళ, తెలుగు భాషల్లో వచ్చిన చిత్రాల్లో ది బెస్ట్ అనదగ్గ ‘విత్ లవ్’ సైతం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఆ చిత్రం మార్చి 6న నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్‌గా రిలీజ్ కాబోతోంది. ఒక విభన్న కథాంశంతో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం.. ఓటీటీలోకి వచ్చాక మరింత ఆదరణ దక్కించుకోవడం ఖాయం.

This post was last modified on March 2, 2026 4:56 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

3 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

3 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

3 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

3 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

5 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

7 hours ago