Movie News

రైరైరారా… డాన్స్ అదరగొట్టేశాడు కదరా

ఉదయం నుంచి ఎప్పుడెప్పుడా అని తెగ వెయిటింగ్ లో పెట్టిన పెద్ది సెకండ్ సింగల్ వచ్చేసింది. నిజానికి సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేస్తామని దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ కు హామీ ఇచ్చినప్పటికీ మూడు గంటలు ఆలస్యంగా పదికి రిలీజ్ చేశారు. సాంకేతిక కారణాలని వేరే చెప్పనక్కర్లేదు కానీ పెద్ద హీరోల విషయంలో ఇది ఎన్నోసార్లు జరుగుతూ వస్తున్నదే.

చికిరి చికిరి చార్ట్ బస్టర్ అయ్యాక దానికి మించి పాట కావాలని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చారు. అది దృష్టిలో పెట్టుకునే బుచ్చిబాబు చాలా జాగ్రత్తగా ఎలా ప్రెజెంట్ చేయాలనే దాని మీద పెద్ద కసరత్తు చేశారు. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది.

పెద్దిలో రామ్ చరణ్ క్యారెక్టర్ ని వర్ణిస్తూ సాగిన గీతంగా అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యానికి రెహమాన్ గాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. భూమి మీద ఎందుకు వచ్చాము, ఏం సాధించాలి, పెద్ద స్థాయికి వెళ్లలేనప్పుడు మగతనం ఎందుకనే రీతిలో అల్లిన పదాలు మాస్ కు సైతం అర్థమయ్యేలా ఉన్నాయి. అసలు హైలైట్ ఇది కాదు.

రామ్ చరణ్ స్టెప్పులకు మెస్మరైజ్ కావడం ఖాయమనే రేంజ్ లో జానీ మాస్టర్ కంపోజింగ్ అదిరిపోయింది. చాలా కాలంగా స్టార్ హీరోలు హెవీ మూమెంట్స్ కు దూరంగా ఉంటున్నారు. ఆ ఆకలి మొత్తం తీరేలా పెద్దిలో చేయించిన డాన్స్ కొంత కాలం సోషల్ మీడియాని ఊపేయడం ఖాయం.

క్రెడిట్ ఖచ్చితంగా బుచ్చిబాబుకి ఇవ్వాలి. ఎందుకంటే ఇంతకన్నాపెద్ద బడ్జెట్, కాన్వాస్ తో లెజెండరీ డైరెక్టర్ శంకర్ చేయలేని మేజిక్ ని తను చేసి చూపిస్తున్నాడు. అందుకే ఫ్యాన్స్ అతని మీద అంత అభిమానం పెంచుకుంటున్నారు. మాస్ దుస్తుల్లో సోలో సాంగ్ గా చరణ్ కిది వన్ అఫ్ ది బెస్ట్ గా నిలిచిపోతుంది.

ముఖ్యంగా ఎప్పుడో నాయక్, రచ్చ తర్వాత తన డాన్స్ పీక్స్ లో చూసింది ఆర్ఆర్ఆర్ నాటు నాటులోనే. ఆది కూడా ఒక్క పాటకే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ పెద్దిలో అలా కాదు. విజిల్స్ కు ఎక్కువ పని చెప్పే నెంబర్స్ బుచ్చిబాబు గట్టిగా సెట్ చేసుకున్నాడు. ఇక ఐటెం సాంగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే.

This post was last modified on March 2, 2026 10:41 pm

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

2 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

3 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

10 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

11 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

11 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

12 hours ago