Political News

వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌డం లేదుగా !

ఏపీ విప‌క్ష పార్టీగా ఉన్న వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ రావాలి.. త‌మ పార్టీ ముందుకు సాగాలి అన్న‌ట్టుగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో వైసీపీ టాక్ ఎక్క‌డా వినిపించ‌డం లేదు. దీనికి తోడు.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని గ్ర‌హించిన మ‌రుక్ష‌ణ‌మే.. కూట‌మి పార్టీలే స్పందిస్తున్నాయి. ప్ర‌తి ప‌క్షం చేసే విమ‌ర్శ‌ల‌ను కూట‌మి పార్టీలే చేస్తున్నాయి. దీంతో వైసీపీకి ఛాన్స్ చిక్క‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. దీంతో వైసీపీ త‌ర‌ఫున వాయిస్ కు బ‌లం లేకుండా పోయింది.

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న విష‌యంలో వైసీపీ దూకుడుగా ముందుకు సాగాల‌ని భావించింది. అందుకే వెంట‌నే వైసీపీ అధినేత జ‌గ‌న్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. కానీ, ఈ విష‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ తీవ్ర‌స్థాయిలో స్పందించారు. దీనిని వ‌దిలి పెట్ట‌కుండా.. రెండు మూడు రోజుల పాటు కొన‌సాగించారు. ఫ‌లితంగా వైసీపీ ఏదో చేయాల‌ని అనుకున్నా.. వెనుక‌బ‌డి పోయింది. ఈ ప్ర‌భావంతో పార్టీ నాయ‌కులు కూడా డీలా ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇక‌, ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌ద‌స్సు విష‌యంలో టీడీపీ దూకుడుగా ఉంది. అనేక సంస్థ‌ల‌తో పెట్టుబ‌డు ల‌పై చ‌ర్చ‌లు సాగిస్తోంది. అయితే.. దీనిపైనా వైసీపీ మౌనంగా ఉంది. ఎలాంటి కామెంట్లు చేయ‌డం లేదు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడు రోజుల స‌ద‌స్సులో ఏపీకి 10 వేల కోట్ల వ‌ర‌కు మాత్ర‌మే పెట్టుబ‌డులు వ‌చ్చాయి. రెండు సంస్థ‌లు మాత్ర‌మే ఒప్పందాలు చేసుకున్నాయి. దీనిని కార్న‌ర్ చేస్తార‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫున నాయ‌కులు భావించినా.. వైసీపీ ఆ చాన్స్ తీసుకోలేదు.

ఇక‌, ధాన్యం కొనుగోలు విష‌యంలో క్రెడిట్ కొట్టేసిన జ‌న‌సేన త‌ర్వాత వెనుక‌బ‌డింది. ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ నిలిచిపోయింది. దీంతో రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ విష‌యాలు .. ప్ర‌భుత్వ అను కూల మీడియాలోనే ఎక్కువ‌గా వ‌చ్చాయి. అయితే.. వైసీపీ మాత్రం దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చు కునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఇదొక్క‌టే చాలా విష‌యాల్లో వైసీపీ వ్యూహం వేయ‌లేక చేతులు ఎత్తేస్తున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి మున్ముందు ఏమైనా మార‌తారేమో చూడాలి.

This post was last modified on January 23, 2025 11:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

2 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

5 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

7 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

9 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

10 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

12 hours ago