స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, మంత్రి భరత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ వారిని ఆహ్వానించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అవలంబిస్తోందని తెలిపారు. ఏపీలో పెట్టుబుడులు పెట్టేందుకు అనుకూలా వాతావరణం కల్పిస్తున్నామని, అనుకూల పరిస్థితులున్నాయని చెప్పారు. ఎయిర్ కనెక్టివిటీ, నౌకాశ్రయాలు, తీర ప్రాంతం, విశాలమైన రోడ్లు ఉన్నాయని చెప్పారు.
ఇక, తమ కుటుంబానికి, తమ జీవితంలో, టీడీపీ నేతల జీవితంలో చంద్రబాబు అరెస్టు లోయెస్ట్ పాయింట్ అని లోకేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. కానీ, జైల్లో ఉన్నపుడు చంద్రబాబు అధైర్య పడలేదని, బయటకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు సింహంలా వచ్చారని లోకేశ్ అన్నారు. ఆ సమయంలో దేశవిదేశాలలో ఉన్న తెలుగు ప్రజలు చంద్రబాబుకు అండగా నిలిచారని చెప్పారు. రాజకీయాలైనా..వ్యాపారాలైనా..ఎన్నో ఇబ్బందులు పడతామని, కానీ, తమ ఆశయం కోసం ముందుకు వెళితే ఫలితాలు వస్తాయని అన్నారు.
2019-24 నుంచి ఏపీ పరువు పోయిందని చాలామంది తనకు చెప్పారని, కలిసికట్టుగా పోరాడి సైకో పాలనను అంతం చేసి సైకోను తరిమికొట్టామని చెప్పారు. రెడ్ బుక్ గురించి ఓ ఎన్నారై మిత్రుడు తనను అడిగారని, ఆల్రెడీ రెడ్ బుక్ ఓపెన్ చేశామని, దానిని పూర్తి చేసే బాధ్యత కూడా తనదేనని లోకేశ్ చెప్పారు. అయితే, కక్ష్యా రాజకీయల కోసం రెడ్ బుక్ వాడడం లేదని, చట్టాన్ని ఉల్లంఘించి తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష విధిస్తామని చెప్పారు. జోహార్ అన్న ఎన్టీఆర్…చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి అంటూ తన ప్రసంగాన్ని లోకేశ్ ముగించారు.