దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్రపంచశాంతిని ప్రశ్నార్థకంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ యుద్ధాన్ని ఇతర ప్రపంచ దేశాలు ఎలా తీసుకున్నా.. భారత్ మాత్రం తటస్థంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది. దీంతో సహజంగానే భారత్ ఇరు దేశాలకు దూరం పాటిస్తోందని అందరూ అనుకున్నారు.
కానీ, రష్యాకు అనుకూలంగా భారత్ తన సైన్యాన్ని పంపిన విషయం ఇటీవల వెలుగు చూసింది. మొత్తం 126 మంది సైనికులను భారత్ రష్యా తరఫున ఉక్రెయిన్‌పై పోరాడేందుకు పంపినట్టు తాజాగా భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఈ 126 మందిలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. మరో 96 మంది భారత సైనికులు యుద్ధం చేయలేమంటూ.. వెనుదిరిగారు. అయితే.. వీరిలో కేవలం 22 మంది మాత్రమే భారత్‌కు తిరిగి వచ్చారు. మిగిలిన వారు ఎక్కడున్నారో తెలియదు. ఇదిలావుంటే.. మరో 16 మంది సైనికులు గల్లంతయ్యారు.
అసలు వీరి జాడ కనిపెట్టడం కూడా అసాధ్యంగా మారింది. ఇటు భారత్కు, అటు రష్యాకు కూడా.. ఈ 16 మంది ఎక్కడున్నారో తెలియడం లేదని విదేశాంగ శాఖ వివరించింది. అయితే.. వీరు ప్రాణాలతోనే ఉన్నారని విశ్వసిస్తున్నట్టు తెలిపింది. ఇదిలావుంటే.. మరో 18 మంది ప్రస్తుతం రష్యా తరఫున పోరాడుతున్నారు.
వారు ఏమయ్యారు?
భారత్-రష్యా సంయుక్త ప్రకటనలో మొత్తం 16 మంది భారత సైనికులు గల్లంతు కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వీరు జీవించి ఉన్నారని చెబుతున్నా.. జాడ గుర్తించలేక పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వీరిని ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న దేశాలు ఎత్తుకెళ్లాయా? లేక.. వీరిని ఉక్రెయిన్ దేశమే నిర్బంధించిందా? అనే అనేక సందేహాలు తెరమీదికి వస్తున్నాయి.
మరోవైపు ఈ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల మృతదేహాల్లో ఇప్పటి వరకు 5 మృతదేహాలను మాత్రమే గుర్తించారు. మిగిలిన 7 మృత దేహాల పరిస్థితిని కూడా అన్వేషిస్తున్నారు. వీరి డీఎన్ ఏ ఆధారంగా విచారణ సాగుతున్నట్టు భారత విదేశాంగ శాఖ వివరించింది.