ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని దావోస్ కు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ జరిగే ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు. ఏయే రంగాల్లో ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించాలి.. పెట్టుబడులు పెట్టేవారికి ఇక్కడ ఉన్న అవకాశాలు, ఇచ్చే సౌకర్యాలు.. యువత, ఉపాధి.. ఇలా అనేక విషయాలపై పక్కాగా ప్రణాళిక రూపొందించుకున్నారు.
ప్రస్తుతం సంక్రాంతిని పురస్కరించుని తన సొంత గ్రామం చంద్రగిరి మండలంలోని నారా వారి పల్లెకు వెళ్లిన సీఎం చంద్రబాబు కుటుంబం ఈ పండుగ సంబరాలు పూర్తికాగానే.. తిరిగి పాలనపై దృష్టి పెట్టి.. అనంతరం దావోస్ పర్యటనకు సీఎం సిద్ధం కానున్నారు. ఈ క్రమంలో పెట్టుబడుల సదస్సుకు తనతో వచ్చే బృందాన్ని కూడా సీఎం చంద్రబాబు రెడీ చేసుకున్నారని సీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. సీఎం వెంట ఇద్దరు మంత్రులు మాత్రమే ఉండనున్నారు.
అయితే.. వీరిలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేరు లేకపోవడం గమనార్హం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా.. ఈ పర్యటనకు దూరంగా ఉంటున్నారు. ఆయన రాష్ట్రంలోనే ఉండిపాలనా యంత్రాంగాన్ని వారం రోజుల పాటు ముందుకు నడిపించనున్నారు. అంటే ఒకరకంగా చంద్రబాబు లేని లోటును పవన్ కల్యాణ్ తీర్చనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వెంట వెళ్లే బృందంలో ఎవరున్నారనే విషయంపై ఆసక్తి పెరిగింది.
వీరే పెట్టుబడులు తెచ్చేది..
1) ముఖ్యమంత్రి చంద్రబాబు
2) మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్
3) పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
4) సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా
5) సీఎం భద్రతా అధికారి శ్రీనాథ్
6) ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్
7) ఏపీ ఈడీబీ సీఈవో సాయి కాంత్ వర్మ
8) కుప్పం ప్రాంతీయ అభివృద్ధి ప్రాజెక్టు అధికారి(కాడా పీడీ) వికాస్ మర్మత్
This post was last modified on January 14, 2025 4:39 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…