నరేంద్ర మోదీ… భారత ప్రధాన మంత్రి మాత్రమే కాదు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ నేత కూడా. దాదాపుగా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో అత్యథిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగిన నేతగా ఇప్పటికే మోదీ రికార్డులకెక్కారు. తాజాగా ఆ సోషల్ మీడియా ఖాతాల ద్వారా… ప్రత్యేకించి యూట్యూబ్ ద్వారా అత్యథిక ఆదాయాన్ని పొందుతూ కూడా మోదీ సరికొత్త రికార్డులను నెలకొల్పారు.
వ్యక్తిగత ఖాతా కేటగిరీలో మోదీ యూట్యూబ్ ఛానెల్ ఒక్క నెలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయితే మోదీ ఈ ఛానెల్ ను ఏదో ఆదాయ ఆర్జన కోసం ప్రారంభించినది కాదు కదా. అయినప్పటికీ… నెలకు కోట్లాది రూపాయలను సదరు ఛానెల్ మోదీకి సంపాదించి పెడుతోంది.
అయినా మోదీ యూట్యూబ్ ఛానెల్ ఏ మేర సంపాదిస్తుందన్న విషయంలోకి వెళితే… నెలకు హీన పక్షం 1.86 లక్షల డాలర్లను సంపాదిస్తున్న ఈ ఛానెల్… అత్యధికంగా 5.67 లక్షల డాలర్ల దాకా సంపాదిస్తోందట. ఈ ఆదాయాన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మార్చి చూస్తే…
మోదీ ఛానెల్ ఆదాయం నెలకు రూ.1.62 కోట్ల నుంచి రూ.4.88 కోట్ల దాకా ఉంటుంది. ఈ ఛానెల్ లో ఇప్పటిదాకా 29,272 వీడియోలను అప్ లోడ్ చేయగా… మొత్తంగా 636 కోట్ల వ్యూస్ వచ్చాయి. వీటిలో ఒక్కో వీడియో ఏకంగా 40 వేలకు పైగా వ్యూస్ సాధిస్తున్నాయి. సగటున ఒక్కో వీడియో 20 వేల వ్యూస్ దాకా సాధిస్తున్నట్లు అంచనా.
ఇక ఈ ఛానెల్ గురించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ తన యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారు. తన అధికారిక కార్యక్రమాలను ప్రసారం చేసేుందకే మోదీ ఈ ఛానెల్ ను ప్రారంభించారట. 2014లో భారత ప్రధాని అయిన తర్వాత కూడా తన ఛానెల్ ను మోదీ కొనసాగించారు.
ప్రస్తుతం ఈ ఛానెల్ కు 2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇంకా కొత్తగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతూనే ఉందని సమాచారం. ఈ స్థాయిలో యూట్యూబ్ సబ్ స్క్రైబర్లు ఉన్న రాజకీయ నేత విశ్వవ్యాప్తంగా ఏ ఒక్కరూ లేరు. యూట్యూట్ సబ్ స్క్రైబర్ల సంఖ్యలో మోదీ తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనార్ ఉన్నారు.
ఈయన ఛానెల్ కు ఉన్న సబ్ స్క్రైబర్ల సంఖ్య కేవలం 60 లక్షలే. మోదీ ఛానెల్ కు ఉన్న సబ్ స్క్రైబర్ల సంఖ్యలో పోలిస్తే… ఈ సంఖ్య నాలుగో వంతే. మోదీ చానెల్ లో ప్రతీ వారం కనీసం 19 వీడియోలో అప్ లోడ్ అవుతున్నాయట.
This post was last modified on January 11, 2025 7:17 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…