పిఠాపురం వర్మగా పేరొందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఖుషీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఆయన ఆ తర్వాత.. ఒకింత ముభావంగానే ఉన్నారు. ఇస్తామన్న పదవిని ఇవ్వకపోగా.. కనీసం ప్రాధాన్యం దక్కడంలేదని వర్మ వగస్తున్న విషయం తెలిసిందే.
పైగా జనసేన నాయకుల నుంచి కూడా ఆయనకు పలుమార్లు అవమానాలు ఎదురయ్యాయనీ వార్తలు వినిపించాయి. దీంతో వర్మ గత నాలుగు మాసాలుగా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనీ రాజకీయ నేతలు పలు మార్లు చర్చించారు. ఇటీవల కోడిపందేల బరుల విషయంలోనూ వర్మ వర్గానికి చేదు అనుభవాలు పెరిగిపోయాయి.
ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వర్మకు ఎదురు దెబ్బలు తగులుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా వర్మకు ఆయన స్వయంగా ఆహ్వానం పలికారు.
అంతేకాదు.. తనతోపాటు వేదికపైనా కూర్చోబెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసాంతం వర్మ ఖుషీ అయ్యారు. ఆనందంగా గడిపారు. అయితే.. దీనికి ముందు జరిగిన చర్చల వ్యవహారంపైనే ఆసక్తి నెలకొంది. పిఠాపురానికి వచ్చిన పవన్ కల్యాణ్‌ను ముందుగానే వర్మ భేటీ అయినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఈ క్రమంలో వర్మకు పవన్ కల్యాణ్‌ను బలమైన హామీ లభించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వర్మ దేనికోసం అయితే.. వేచి చూస్తున్నారో.. అదే ఆయనకు వరంగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి టికెట్‌ను త్యాగం చేయాల్సి వచ్చినప్పుడే.. చంద్రబాబు వర్మకు బలమైన హామీ ఇచ్చారు.
క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో చోటు ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అప్పట్లో చెప్పుకొచ్చారు. కానీ, మంత్రి వర్గంలో చోటు లభించలేదు. అలాగని వర్మ ఎక్కడా బయటపడలేదు. ఎక్కడా యాగీ కూడా చేయలేదు. ఇక, ఈ వ్యవహారం నానుతున్న క్రమంలో పవన్ నుంచి గట్టి హామీ లభించినట్టు తెలుస్తోంది.
ఏంటా హామీ..?
ఇప్పుడు వర్మ అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో జరుగుతున్న చర్చ కూడా ఇదే కావడం గమనార్హం. తమ నాయకుడికి పవన్ నుంచి ఎలాంటి హామీ లభించిందన్న విషయంపై వారు చర్చోపచర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
అయితే.. క్షత్రియ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి.. దానికి చైర్మన్ పదవిని సృష్టించి.. ఆ పదవిని వర్మకు ఇచ్చే ఆలోచన ఉందని వర్మ అనుచరులు భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ నుంచి బలమైన హామీ దక్కిందన్న ప్రచారం జరుగుతోంది. ఇది కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవిగా కూడా చెబుతున్నారు. అందుకే తాజా కార్యక్రమంలో వర్మ ఖుషీ అయినట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో ప్రభుత్వం దీని కార్యాచరణ ఎలా మొదలుపెడుతుందో చూడాలి.
This post was last modified on January 11, 2025 5:52 pm
పీవీ సిందు.. భారత్ గర్వించదగ్గ ఓ క్రీడాకారిణి. ప్రతి తెలుగు కుటుంబానికి గర్వకారణంగా నిలిచిన ప్లేయర్. బ్యాడ్మింటన్ లో భారత్…
అరుంధతి విలన్ సోను సూద్ స్వీయ దర్శకత్వంలో తీసిన ఫతే నిన్న విడుదలయ్యింది. గేమ్ ఛేంజర్ హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గుజరాత్‌లోని…
హీరోయిన్ లు అంటే... చాలా సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. అయితేనేం... వారిలోని భక్తి ఒక్కోసారి వారి చేత వండర్లు చేయిస్తూ…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…