ఏపీ ప్రజలు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేను నమ్మారని.. అందుకే కనీ వినీ ఎరుగని రీతిలో ఘన విజయం అందించారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బీజేపీ-జనసేన-టీడీపీకి ఘన విజయం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు. విశాఖలో ప్రధాని మోడీ పాల్గొన్న సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అయితే.. ఆయన ప్రసంగం క్లుప్తంగానే సాగింది. కేవలం 10 నిమిషాల్లోనే పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం. అయితే.. మాట్లాడిన కొద్ది సేపు కూడా.. కీలకమైన అంశాలను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.
ప్రధాన మంత్రి రాకతో ఏపీకి 2 లక్షల రూపాయలకుపైగా పెట్టుబడులు వస్తున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు.త ద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తోందని చెప్పారు. ప్రధాని మోడీ అంటే ధైర్య సాహసాలకు ప్రతీకగా పేర్కొన్నారు. ధైర్య సాహసాలను నింపితే అది పటిష్ఠ భారత్
అవుతుందన్నారు. సదాశయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. దేశాన్ని పురోభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ హయాంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశం గతిని మార్చే కార్యక్రమంగా అభివర్ణించారు. “పాలకులకు సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమే” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
దేశంలోని అపన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షిస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. అందుకే.. ఆయన నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించేందుకు మోడీ చేస్తున్న కృషి అనన్య సామాన్యమని పేర్కొన్నారు. వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టిన మోడీ.. ప్రజల మనసులు గెలుచుకోవడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. అవినీతి, అరాచక పాలనతో గత ఐదేళ్లు రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని పరోక్షంగా వైసీపీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు దార్శనిక నేతలని పేర్కొన్నారు. వీరితో దేశం అభివృద్ది పథంలో ముందుకు సాగుతుందన్న నమ్మకం ప్రజలకు ఉందని తెలిపారు.
This post was last modified on January 9, 2025 11:07 am
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…