Political News

త‌మ్ముళ్లు వ‌ర్సెస్ త‌మ్ముళ్లు: ఎవ‌రూ స‌రిగా లేరు.. !

టీడీపీ-బీజేపీ నేత‌ల మ‌ధ్య వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి.. స‌ర్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. సాధార‌ణంగా ఒకే వ‌ర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌వ‌నే సామెత ఉన్న నేప‌థ్యంలో రెండు పార్టీల‌కు చెందిన వారు క‌లిసి ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌లు కామ‌న్ గానే తెర‌మీద‌కు వ‌స్తుంటాయి. అయితే.. ఇప్పుడు ఒకే పార్టీకి చెందిన నాయ‌కులు త‌న్నుకునే ప‌రిస్థితి కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఇలా.. ఒక చోట రెండు చోట్ల అయితే ఫ‌ర్లేదు.

కానీ, 5-10 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇరుగుపొరుగు టీడీపీ ఎమ్మెల్యేలు… కూడా క‌లివిడిగా లేక‌పోతే.. త‌న్నుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని మ‌డ‌క‌శిర‌, శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గాలు, విజ‌య‌వాడ‌లోని సెంట్ర‌ల్‌-ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గాలు, గుంటూరు వెస్ట్-ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు త‌న్నుకుంటున్నారు. దీనికి కార‌ణం.. సొంత రాజ‌కీయాలేన‌ని కొంద‌రు చెబుతున్నారు. మ‌రికొంద‌రు ఆధిప‌త్య రాజ‌కీయాలు చేసుకుంటున్నార‌ని అంటున్నారు.

మ‌డ‌క‌శిర‌-శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యేల వివాదాలు త‌ర‌చుగా రోడ్డెక్కుతున్నాయి. ఇక‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌-ఈస్ట్‌లో మాత్రం.. కొంత వ‌ర‌కు రోడ్డెక్క‌క‌పోయినా.. ఎమ్మెల్యేల మ‌ధ్య మాత్రం కోల్డ్ వార్ సాగుతోంది. ఇక‌, గుంటూరులో మాత్రం ఈ వివాదాలు బ‌హిరంగంగానే సాగుతున్నాయి. మ‌రికొన్ని చోట్ల త‌మ్ముళ్లు పంప‌కాల‌తో స‌రిపుచ్చుకుంటున్నారు. అంటే వివాదాల‌కు అవ‌కాశం లేకుండా ముందుకు సాగుతున్నారు. దీంతో వారి ప‌రిస్థితి అధిష్టానానికి పెద్ద ఇబ్బందిగా మార‌లేదు.

కానీ, ఇలా వివాదాల‌కు దిగుతున్న వారితోనే ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ ప‌రంగా ఇలాంటి వారిని క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్నారు. అయితే.. ఇది అంత సాధ్య‌మ‌య్యే లా క‌నిపించ‌డం లేదు. అందుకే పార్టీ కూడా ఈ విష‌యాల‌ను చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేయ‌డం గ‌మ‌నార్హం. ఇసుక‌, మ‌ద్యం వ‌ర‌కే కాకుండా.. ఇత‌ర విష‌యాల‌పైనా ఆధిప‌త్యం కోసం పోరాడుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 8, 2025 12:56 pm

Share

Recent Posts

ఆ రోడ్డుపై వైసీపీ దుష్ప్రచారం.. ఖండించిన డిప్యూటీ సీఎంవో

ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…

32 minutes ago

చీకట్లో మొబైల్‌ చూస్తున్నారా.. ఈ డేంజర్‌ గురించి తెలుసుకోండి..

రాత్రి నిద్రపోయే ముందు ఫోన్‌ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్‌ స్క్రీన్‌…

49 minutes ago

వెంకీ త్రివిక్రమ్ సినిమా స్థాయి బజ్ ఉందా?

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…

2 hours ago

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి… ఏం జరిగింది?

ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…

2 hours ago

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

3 hours ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

4 hours ago