టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు మరింతగా ప్రాధాన్యం పెరిగింది. బుధవారం ప్రదానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్భంగా ఏపీలోని కూటమి సర్కారు విడుదల చేసిన పోస్టర్ లోకి నారా లోకేశ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేశారు. వాస్తవానికి కూటమిలో టీడీపీ బిగ్ ప్లేయర్ గా ఉండగా… బీజేపీ, జనసేనలు అందులో కొనసాగుతున్నాయి. ఈ లెక్కన టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన తరఫున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ తరఫున ఆ పార్టీ కీలక నేత హోదాలో ప్రదాని నరేంద్ర మోదీ ఫొటోలతో కూడిన పోస్టర్ ను రూపొందించడం ఆనవాయితీ. అయితే అనూహ్యంగా ఈ పోస్టర్ లో ముగ్గురు నేతల ఫొటోలకు బదులుగా నలుగురు నేతల ఫొటోలు చేరిపోయాయి.
రాష్ట్రానికి వస్తున్న అతిథిగా ప్రధాని మోదీని ఒకింత పెద్ద సైజు ఫొటోలో చూపించిన రాస్ట్ర ప్రభుత్వం… మోదీకి కుడి వైపున చంద్రబాబు, ఎడమ వైపున పవన్ కల్యాణ్ ల ఫొటోలను పెట్టారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రభుత్వ పాలనలో లోకేశ్ పాత్ర అంతకంతకూ పెరిగిపోతున్న క్రమంలో ఆయన ఫొటోను కూడా ఈ పోస్టర్ లో పెట్టాలని అధికార యంత్రాంగం భావించినట్టు ఉంది. అందుకే… చంద్రబాబు ఫొటో పక్కన లోకేశ్ ఫొటోకు స్థానం కల్పించారు. వెరసి ఈ పోస్టర్ లో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్… నలుగురు నేతలు చిద్విలాసంగా నవ్వుతూ కనిపిస్తున్నారు.
టీడీపీ భావి అధినేతగా లోకేశ్ ఇప్పటికే గుర్తింపు సంపాదించుకున్నారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు యువగళం పేరిట చేపట్టిన పాదయాత్రతో లోకేశ్ తన సత్తాను నిరూపించుకున్నారనే చెప్పాలి. అదే సమయంలో తాను ఓడిన మంగళగిరి నియోజకవర్గంలోనే తిరిగి ఎన్నికల బరిలోకి దిగి ఘన విజయం సాధించిన తీరుతోనూ లోకేశ్ తన పట్టుదల ఎలాంటిదో కూడా నిరూపించుకున్నారు. మొత్తంగా పార్టీలో ఏ నిర్ణయం అయినా తీసుకోగలిగే సత్తా తనకు ఉందని లోకేశ్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. అందుకే కాబోలు… మొన్నటి ఎన్నికల్లో టీడీపీ టికెట్లతో పాటుగా మంత్రివర్గ కూర్పులోనూ ఆయన మార్కే చాలా స్పష్టంగా కనిపించింది. పార్టీలో సత్తా నిరూపించుకున్న లోకేశ్… ఇటు ప్రభుత్వ పాలనలోనూ తనదైన మార్కు చూపుతూ సాగుతున్నారు. ఫలితంగా కూటమి సర్కారు తాజా పోస్టర్ లో లోకేశ్ సరికొత్తగా స్థానం సంపాదించుకున్నారు.
This post was last modified on January 8, 2025 1:13 pm
మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…
అల్లుడు అదుర్స్ తర్వాత తెలుగులో దర్శనం లేకుండా మాయమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన సమయాన్ని…
ప్రపంచాన్ని వణికించిన వైరస్ల గురించి చెప్పుకోగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కోవిడ్-19 (కరోనా వైరస్). అయితే, కరోనా ముందు కూడా…
ఏదో అనుకుంటాం కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ తారల మీద చూపించే ప్రభావం కొన్నిసార్లు మాములుగా ఉండదు. పర్సనల్ గా…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టులో గట్టి షాకే తగిలింది. ఏసీబీ విచారణకు…
పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఏర్పడే సందిగ్దత, ఆలస్యం మిగిలిన వాటి మీద ప్రభావం చూపించడం చాలాసార్లు చూసిందే.…