“తెల్లారే సరికి పింఛన్లు పంచకపోతే ప్రపంచం తలకిందులు అవుతుందా? ఇది ఉద్యోగులను క్షోభ పెట్టినట్టు కాదా? మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని కనీసం పట్టించుకోకుండా.. ఉదయం 5 గంటలకే ఇళ్లకు తోలుతున్నారు. ఇదేం పద్ధతి“- ఇదీ.. వైసీపీ సానుభూతి పరుడుగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి… (రామిరెడ్డి) చేసిన వ్యాఖ్యలు. అయితే.. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
ఉద్యోగులు ఉన్నది ప్రజలకు సేవ చేసేందుకేనని.. సమయంతో నిమిత్తం లేదని అంటున్నారు. ఒకవేళ సమయం ప్రకారం పనిచేయాలని అనుకున్నా.. పింఛన్ల పంపిణీ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేసుకుని ఇళ్లకు వెళ్లిపోతున్నారు కదా? అని చెబుతున్నారు. నీతులు చెప్పాలని అనుకుంటే అప్పట్లో తెల్లవారు జామున 5గంటలకు వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను ఇళ్లకు పంపించిన జగన్‌కు ఎందుకు చెప్పలేదని నిలదీస్తున్నారు.
ప్రస్తుతం పింఛన్ల పంపిణీ సక్రమంగా సమయానికి జరిగిపోతోందని.. ఇది తట్టుకోలేని వైసీపీ నేతలు.. రామిరెడ్డిని ముందు పెట్టి విమర్శలు చేయిస్తున్నారని విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు ఒకరు విమర్శించారు. చంద్రబాబు కూడా.. ఉదయాన్నే బయలు దేరి ప్రజల మధ్యకు వెళ్తున్న విషయాన్ని, పింఛన్లు పంచుతున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి.. రామిరెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని లేకపోతే… తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాగా.. వైసీపీ హయాంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన రామిరెడ్డి.. టీడీపీ నేతలతో చీవాట్లు తిన్నారు. ఇటీవల ఆయనపై కేసు కూడా నమోదైంది. అనుమతి లేకుండా.. మందు పార్టీ ఇచ్చారన్న అభియోగాలపై ఆయనపై కేసు పెట్టారు. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. సర్కారుపై దుమ్మెత్తి పోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని.. ఉద్యోగుల్లోని మరో సంఘం నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on January 6, 2025 4:18 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు.…
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగళూరుకు క్యూ కడుతున్నార ని.. భవిష్యత్తులో కుప్పానికి…
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…