
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు… తప్పకుండా పాటించాలని కూడా ఆయన విన్నవించారు. తాజాగా విజయవాడలో పుస్తక మహో త్సవం(బుక్ ఎగ్జిబిషన్) ప్రారంభమైంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అభిమానులకు తాను ప్రాణమైతే, తనకు పుస్తకాలు ప్రాణమన్నారు. లక్షలాది మంది హృదయాలను ఆకట్టుకునే శక్తి తనకు పుస్తకాల వల్లనే వచ్చిందని తెలిపారు.
తన అభిమానులంతా తెలుగుభాషను పరిరక్షించే సైనికులు కావాలని, పుస్తకాలు చదవాలని పవన్ కల్యా ణ్ సందేశం ఇచ్చారు. పుస్తకాలు చదివి, సమాజంలో అన్యాయాలపై పోరాడేందుకు సిద్ధం కావాలని సూచించారు. “తెలుగు నేర్చుకోండి తెలుగు నిర్లక్ష్యం చేయకండి“ అని పిలుపునిచ్చారు. ఈ సందర్భం గా వైసీపీ హయాంలో తెలుగుపై తీసుకున్న నిర్ణయాన్ని ఆయన పరోక్షంగా దుయ్యబట్టారు. అప్పట్లో తెలుగు కాదు.. ఇంగ్లీషు ముద్దు అంటూ.. ప్రచారం చేసి.. పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేసే ప్రయత్నం చేశారు.
ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. “ఆంగ్లం అవసరమే కానీ, పేదరికం పారదోలేందు కు అది మార్గం కాదు. అందరూ ఇంగ్లీషే మాట్లాడే ఇంగ్లాండ్లో కూడా పేదరికం ఉంది“ అని చురకలు అంటించారు. రచయితలను కూడా ఈ సమాజం గౌరవించాలని సూచించారు. పుస్తకం చదవడం ద్వారా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. తాను చదువును మధ్యలోనే ఆపినా, పుస్తకాలు చదవడం ఆపలేదన్నారు. పుస్తకం జీవితంతోనూ, సమాజంలో అన్యాయాలతోనూ పోరాడే ధైర్యాన్నిస్తుందన్నారు. యువతీయువకులు కూడా పుస్తకాలు చదవడం మానవద్దని పవన్ సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates