మొన్న ఏడు కేసులు.. నిన్న రెండు కేసులు.. నేడేమో ఆరు కేసులు.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల అప్ డేట్స్ ఇవి. ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో రోజూ 70-80కి తక్కువ కాకుండా కేసులు బయటికి వస్తున్నాయి. ఒక్కో జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం పదో వంతు కేసులు కూడా వెలుగులోకి రావట్లేదు.
కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఇక్కడ కరోనా ప్రభావం బాగా తగ్గిపోయినట్లే కనిపిస్తోంది. అతి త్వరలో కరోనా ఫ్రీ స్టేట్‌గా తెలంగాణ మారుతుందని అంటున్నారు. కేసుల సంఖ్య చూసి అయితే రాష్ట్ర వాసులు హమ్మయ్యా అనుకుంటున్నారు.
కానీ అదే సమయంలో ఈ నంబర్లు కరెక్టేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏపీలో కరోనా కేసుల సంఖ్య చాలా పెద్దగా కనిపిస్తుండటానికి అక్కడ పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేస్తుండటమే కారణం అంటున్నారు.
ఏపీ దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటి. తెలంగాణ పరిస్థితి దానికి పూర్తి భిన్నం. టెస్టుల నిర్వహణలో బాగా వెనుకబడి ఉంది. టెస్టులు చేయకపోవడం వల్లే ఇక్కడ పెద్దగా కేసులు బయటపడటం లేదని అంటున్నారు. కానీ అవసరం లేకున్నా ఇష్టానుసారం టెస్టులు చేయడంలో అర్థమేముందని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు.
కేసీఆర్ కూడా టెస్టుల విషయంలో ఏపీకి, తెలంగాణకు పోలిక పెట్టడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎక్కువ టెస్టులు చేస్తే ఏమైనా ప్రైజులిస్తారా అన్నారు. లక్షణాలు ఉంటేనే కదా టెస్టులు చేస్తాం అన్నది తెలంగాణ ప్రభుత్వ పెద్దల వాదనగా ఉంది.
కానీ హైదరాబాద్ లాంటి చోట్ల కరోనా నివురు గప్పిన నిప్పులా ఉందని.. ఈ కేసుల సంఖ్యను చూసి మురిసిపోతే.. ఉన్నట్లుండి వైరస్ విజృంభించవచ్చని.. రాబోయే రోజుల్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగొచ్చని.. కాబట్టి జాగ్రత్త పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
This post was last modified on April 29, 2020 9:51 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…