చంద్రయాన్ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసిన దేశంగా భారత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేని దేశంగా కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ కోవలోనే ఆంధ్రప్రదే్శ్ లోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం డోలీలే గిరిజనులకు గతి. అయితే, గిరిజనులకు ఆ దుస్థితి తప్పించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నడుం బిగించారు.ఏపీలో డోలీల మోతకు చెల్లుచీటీ పాడేందుకు పవన్ ప్రయత్నాలు మొదలుబెట్టారు.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలోని మారుమూల గిరిజన గ్రామాలకు కూడా పక్కా తారు రోడ్లు నిర్మించేందుకు ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారు. అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తొలి దశలో ఆ జిల్లాల్లో 9 రోడ్ల నిర్మాణం జరపాలని అధికారులకు చంద్రబాబు, పవన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులకు గిరిజన గ్రామాల రహదారులను అనుసంధానించేందుకు దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో గిరిజనులకు డోలీ మోత నుంచి త్వరలోనే విముక్తి లభించనుంది. సరైన రహదారి లేక వాగులు, వంకలు దాటుకుంటూ కాలినడకన డోలీలో రోగులను మోసుకువెళుతున్న క్రమంలో ఎంతోమంది గిరిజనులు సకాలంలో వైద్యం అందక మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 499 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. ఈ నెల 20న పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గ్రామంలో రోడ్ల పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో అన్ని గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు, పవన్ ముందుకు వెళుతున్నారు.
This post was last modified on December 17, 2024 5:36 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…