టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత ఉత్కంఠ రేపిందో…ఆయన విడుదల వ్యవహారం అంతకన్నా తీవ్ర ఉత్కంఠను రేపింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ రాత్రంతా అల్లు అర్జున్ ను సాంకేతిక కారణాలతో జైలు అధికారులు జైల్లో ఉంచారు. ఈ క్రమంలోనే జైలు అధికారులపై చట్టపరంగా ముందుకు వెళతామని అల్లు అర్జున్ తరఫు లాయర్లు తెలిపారు.
బెయిల్ ఆర్డర్ కాపీ అందుకున్న వెంటనే అల్లు అర్జున్ ను విడుదల చేయాలని హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చిందని, కానీ, జైలు అధికారులు విడుదల చేయలేదని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి చెప్పారు. అందుకే, సంబంధిత అధికారులపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. అల్లు అర్జున్ ను చట్టవ్యతిరేకంగా జైలులో రాత్రంతా ఉంచారని, ఈ విషయంపై కచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.
బెయిల్ ఆర్డర్ కాపీని జైలు అధికారులకు నిన్న సాయంత్రం అందించామని, అది అందిన వెంటనే అల్లు అర్జున్ ను ఎందుకు విడుదల చేయలేదో జైలు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. బెయిల్ ఆర్డర్ కాపీ అందిన తర్వాత అల్లు అర్జున్ ను జైలులో ఉంచకూడదని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని, అయినా సరే రాత్రంతా అల్లు అర్జున్ ను జైలులో ఉంచారని అన్నారు. మరోవైపు, ఈ విషయంపై అల్లు అర్జున్, అల్లు అరవింద్ చాలా అసహనంగా ఉన్నారని, తప్పకుండా జైలు అధికారులపై లీగల్ గా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
This post was last modified on December 14, 2024 11:52 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…