“గత ఆనవాళ్లను కూకటి వేళ్లతో పెకలించి వేయాలి”- ఇదీ.. సీఎం చంద్రబాబు నేరుగా కలెక్టర్లకు చెప్పిన మాట. స్థానిక మీడియా కంటే కూడా.. దీనిని జాతీయ మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండు రోజులు కూడా .. నొక్కి మరీ చంద్రబాబు చెప్పిన మాట ఇదే. అయితే.. ఇది రాజకీయంగా కంటే కూడా.. పాలన పరంగానే ఆయన దిశానిర్దేశం చేయడం గమనార్హం. నిజానికి వైసీపీ తీసుకువచ్చిన..అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆగిపోయాయి.
వలంటీర్, సచివాలయం, ఇంటికే రేషన్, ఇంటికే డాక్టర్ ఇలా.. కొన్ని బ్రాండ్లు వైసీపీ సొంతం. కానీ, వీటిని కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. ఒకరకంగా ఇది ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే.. వాటిని నిలిపి వేసిన తర్వాత.. ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో అని అనుకున్నారు. కానీ, ఎలాంటి వ్యతిరేకత రాలేదు. దీంతో ఇప్పుడు ముందుకు సాగేందుకు.. మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి సర్కారు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మాట వినిపించకూడదన్న వాదన కూటమి నేతల మధ్య వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే పాఠశాలల్లో తీసుకువచ్చిన మౌలిక సదుపాయాల కల్పనపైనా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. జగన్ హయాంలో పాఠశాలల్లో నాడు-నేడు అనే కాన్సెప్టును తీసుకువచ్చారు. ఇప్పుడు దీని స్తానంలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తద్వారా.. నాడు-నేడు పోయి.. ‘ఫ్యూచర్ స్కూల్స్’ కాన్సెప్టు రానుంది. దీనిపై చంద్రబాబు సోదాహరణంగా కలెక్టర్లకు వివరించారు. ఇదేసమయంలో ప్రతి రెండో శనివారం కూడా.. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్టును ప్రకటించారు.
ఇది గ్రామీణ స్థాయిలో మరింత మార్పునకు శ్రీకారం చుట్టనుంది. చెత్త ఏరివేత, పరిశుభ్రతకు పెద్ద పీట వేయనున్నారు. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాలు కూడా వైసీపీ మార్కును దాదాపు చెరిపేయనున్నాయి. ఇంటింటికీ పింఛన్ అనేది తమ బ్రాండుగా చెప్పుకొన్నవైసీపీ ఇప్పుడు దీనినివదులుకున్న విషయం తెలిసిందే. టీడీపీ దీనిని ఓవర్ టేక్ చేసింది.
ఇలానే.. పాఠశాలలు, ఆసుపత్రులు.. సహా అనేక రంగాల్లో మరింత మెరుగైన సేవల ద్వారా..జగన్ మార్కును తుడిచేయాలన్న కాన్సెప్టు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుండడం గమనార్హం. అయితే.. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అధికారంలో ఎవరు ఉంటే వారి మార్కు పాలన సాగాలని కోరుకోవడం సరైన నిర్ణయమే కదా..!
This post was last modified on December 13, 2024 9:44 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…