వైసీపీకి అవంతి, గ్రంధి శ్రీనివాస్ గుడ్ బై!

2024 అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం పాలైన తర్వాత వైసీపీ అధినేత జగన్ తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. అవమానభారంతో ఉన్న సమయంలోనే పార్టీకి చెందిన కీలక నేతలు వేరే పార్టీలలో చేరడం, పార్టీకి గుడ్ బై చెప్పడం జగన్ కు షాకింగ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో షాక్ లో ఉన్నారు జగన్.

ఆ షాక్ నుంచి తేరుకోకముందే జగన్ కు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భారీ షాకిచ్చారు. వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని గ్రంధి శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా గ్రంధి శ్రీనివాస్ ప్రకటించారు.

చాలా కాలంగా పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న గ్రంధి శ్రీనివాస్ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై శ్రీనివాస్ ఎటువంటి ప్రకటన చేయలేదు. శ్రీనివాస్ టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రకారమే కొందరు టిడిపి నేతలతో ఆల్రెడీ ఆయన మంతనాలు జరిపినట్లుగా ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గ్రంధి శ్రీనివాస్ ఓడించిన సంగతి తెలిసిందే.