జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును టీటీడీ ఛైర్మన్ చేయబోతున్నారని చాలాకాలం ప్రచారం జరిగినా…చివరకు బీఆర్ నాయుడును ఆ పదవి వరించింది. దీంతో, నాగబాబును పెద్దల సభకు పంపేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారని ప్రచారం కూడా జరిగింది. అయితే, తాజాగా నాగాబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని మరో ప్రచారం తెరపైకి వచ్చింది. నాగబాబుకు బెర్త్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది.
ఏపీ కేబినెట్ లోకి 25 మందిని తీసుకునే చాన్స్ ఉండగా…24 మంది మంత్రులను ఆల్రెడీ ఎంపిక చేశారు. మిగిలిన ఆ మంత్రి పదవిని నాగబాబుకు దక్కనుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆర్. కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్ లను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఎన్డీఏ కూటమికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ప్రకారం ఈ మూడు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం అయ్యే అవకాశముంది. రాజ్యసభ తలుపులు మూసుకుపోవడంతో నాగబాబుకు ఏపీ కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది.
This post was last modified on December 9, 2024 11:07 pm
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…