వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ఏపీ మంత్రి పొంగూరు నారాయణ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉండగా జగన్ చేసిన పనులతో తాము ఇప్పుడు తలెత్తుకోలేక పోతున్నామని ఆయన మండిపడ్డారు. తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండీ.. ఆయన తిప్పలు పెట్టాడు. ఇప్పుడు అధికారం పోయాక కూడా తిప్పలు పెడుతున్నాడు. ఆయన వల్ల మేం తలెత్తుకోలేక పోతున్నాం. ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు
అని నారాయణ వ్యాఖ్యానించారు.
ఐదేళ్లపాటు అమరావతిని నాశనం చేశారని.. దీని వల్ల 5 వేల కోట్ల రూపాయల అదనపు నష్టం వాటిల్లుతోందని మంత్రి తెలిపారు. దీనికిసంబంధించి ఆయన పలు లెక్కలు చెప్పుకొచ్చారు. రాజధానిలో 2015-18 మధ్య జరిగిన పనులను వైసీపీ వచ్చాక నిలిపి వేశారని.. దీని వల్ల కొన్ని నిర్మాణాల నాణ్యత దెబ్బతిందని.. ఫలితంగా వందల కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఇక, అప్పట్లో టెండర్లు దక్కించుకున్న వారు వెళ్లిపోయారని, ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలుస్తున్నామని దీని వల్ల కూడా వందల కోట్ల రూపాయల భారం పెరిగిందన్నారు. అలాగే.. రహదారులు తవ్వేశారని, కాలువలు తెగ్గొట్టారని, దీంతో మరికొన్ని వందల కోట్ల నష్టం వచ్చిందన్నారు.
“ఇవన్నీ చెప్పాలంటే నోరు రావడం లేదు. ఎంత విధ్వంసం చేయాలో అంతా చేశారు. ఇప్పుడు ఇవన్నీ చెబితే.. అతిగా చెప్పినట్టు ఉంటుందని అంటున్నారు. కానీ, నష్టాలు వందలు కాదు వేల కొట్ల రూపాయల్లో ఉన్నాయి. ఎవరు తిన్నట్టు? ఇదంతా ప్రజా ధనం. ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాం” అని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. డిసెంబరు చివరి వారంలో టెండర్లు పిలుస్తున్నట్టు తెలిపారు. జనవరి నుంచి కొత్తగా టెండర్లు దక్కించుకున్నవారు రాజధాని పనులు ప్రారంభిస్తారని తెలిపారు. 11 వేల కోట్ల రూపాయలను ప్రస్తుతం కేటాయించామని.. పనులు వేగంగా ప్రారంభమయ్యాక సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇవీ.. జగన్ తెచ్చిన నష్టాలు..
This post was last modified on December 4, 2024 12:15 am
2018లో విడుదలైన నేల టికెట్ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ మాళవిక శర్మ. తాజాగా ఆమె గోపీచంద్…
వైసీపీ అదినేత, మాజీసీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. ఇదేదో…
పుష్ప 2 ది రూల్ కు పని చేస్తున్న సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి స్టూడియో నుంచి తీసుకున్న పిక్…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ అజ్ఞాతవాసి విడుదలకు ముందు ఒక ఫ్రెంచ్ మూవీ నుంచి స్ఫూర్తి పొంది…
ప్రస్తుతం దేశమంతా పుష్ప వైల్డ్ ఫైర్ రాజుకుంది. రేపు రాత్రి 9.30 గంటల స్పెషల్ షోతో పుష్పగాడి రూల్ మొదలు…
ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేసిన దగ్గుబాటి రానా.. ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ‘విరాట పర్వం’ తర్వాత అతను…