మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చి వారం గడుస్తున్నా సీఎం పీఠంపై పీటముడి విప్పడంపై బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తూనే ఉన్నారు. సీఎం రేసులో ఫడ్నవీస్, షిండేలు ప్రధానంగా ఉండగా…ఏదైనా అవకాశం వస్తుందేమోనని అజిత్ పవార్ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అని ఖరారైంది. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
డిసెంబరు 2వ తేదీన లేదంటే 3వ తేదీన బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఫడ్నవీస్ ను ఎన్నుకోబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ పెద్దలదే తుది నిర్ణయం అని షిండే ఈ రోజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత నడ్డాలు చర్చించిన అనంతరం ఫడ్నవీస్ పేరును ఆ సీనియర్ నేత మీడియాకు వెల్లడించారు.
ముంబైలో మహాయుతి కూటమి సమావేశం రద్దు కావడం, ఆ భేటీ రద్దు చేసుకుని తన సొంతూరికి షిండే హఠాత్తుగా వెళ్లడం వంటి పరిణామాలు చూసి షిండే కూడా సీఎం పదవి కావాలని పట్టుబడుతున్నారని అంతా అనుకున్నారు. అయితే, బీజేపీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే ఈ రోజు చెప్పడంతో ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి సొంతూరికి రాలేదని, అందుకే కాస్త విశ్రాంతి తీసుకునేందుకు ఇక్కడకు వచ్చానని షిండే చెప్పారు.
మరోసారి మహాయుతి కూటమి పాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజల తీర్పుతో మహాయుతి కూటమికి బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే విషయంలో బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మరోసారి షిండే స్పష్టం చేశారు. ప్రభుత్వానికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమిలో భేదాభిప్రాయాలు లేవని తేల్చి చెప్పారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ కలిసి ఒక అభిప్రాయానికి వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈనెల 5వ తేదీన ఉంటుందని ఇప్పటికే బీజేపీ, శివసేన నేతలు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
This post was last modified on December 2, 2024 9:27 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…